మెహ‌రీన్ మ‌తిచెడే త‌ళుకుబెళుకులు

Update: 2021-11-01 02:30 GMT
పంజాబీ బ్యూటీ మోహ‌రీన్ పిర్జాదా మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు డే బై డే మ‌రింత షైన్ అవుతోంది. కెరీర్ ఆరంభంలో క్యూట్ లుక్ తో ఆక‌ట్టుకున్న అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాల త‌ర్వాత బొద్దుగా మారింది. ఆ బొద్దుత‌నం కాల‌క్ర‌మేణా కెరీర్ కి స‌మ‌స్య‌గా మారింది.  ఓ వైపు వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఆకృతిపై మెహ‌రీన్  శ్ర‌ద్ద పెట్ట‌క‌పోవ‌డం ఇబ్బంది క‌రంగా మారింది. దీంతో అమ్మ‌డి ఫాలోవ‌ర్స్  చ‌బ్బీ లుక్ పై హాటెస్ట్ కామెంట్ల‌తో దాడి చేసారు. దీంతో మెహ‌రీన్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. అప్ప‌టి నుంచి శ‌రీర సౌష్టవంలో భారీ మార్పులే తీసుకొచ్చింది. మ‌ళ్లీ అమ్మడు మున‌పటి అందంలో త‌ళుక్కున మెరుస్తోంది.

దాదాపు జీరో సైజ్ లుక్ కి బాడీ షేప‌ప్ చేసింది. తాజాగా అమ్మ‌డు కొత్త ఫోటో షూట్ లో మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. రెడ్ హాట్ లుక్ లో ఒక సోపాపై థై అందాల్ని ఎలివేట్ చేస్తూ మంటల రేపుతోంది. స్కిన్ టోన్డ్ బాడీతో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌కు న‌ల్ల‌టి అద్దాలు ధ‌రించి అమ్మ‌డు కెమెరాకి ఫోజులిచ్చింది. డార్క్ లైట్ లో షూట్ చేసిన ఈ సెష‌న్ లో మెహ‌రీన్ టెంప్టింగ్ లుక్ తో క‌ట్టిప‌డేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో  ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. మెహ‌రీన్ అందానికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్ త‌మదైన శైలి కామెంట్ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

ఇక మెహ‌రీన్ సినిమాల విష‌యానికి వ‌స్తే యువ హీరో సంతోష్ శోభ‌న్ స‌ర‌స‌న మంచి రోజులొచ్చాయి సినిమాలో న‌టిస్తోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. అలాగే `ఎఫ్ -2` కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న `ఎఫ్ 3` లోనూ న‌టిస్తోంది.  అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో అమ్మ‌డు మ‌ళ్లీ హ‌నీగా ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మే.
Tags:    

Similar News