మారుతి - బన్నీ వాస్ చేతుల మీదుగా విడుదలైన 'మిస్సింగ్' ట్రైలర్..!

Update: 2021-07-24 09:30 GMT
హర్షా నర్రా - నికీషా రంగ్వాలా - మిషా నారంగ్ ప్రధాన పాత్రలతో రూపొందుతున్న సినిమా "మిస్సింగ్". కొత్త దర్శకుడు శ్రీని జోస్యుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల - లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. హీరో మరియు డైరెక్టర్ ఇద్దరూ కూడా నిర్మాతల కొడుకే అవడం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకుడు మారుతి - నిర్మాత బన్నీ వాసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై "మిస్సింగ్" చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు.

యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో తన ప్రేయసి కనిపించడం లేదంటూ హీరో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో 'మిస్సింగ్' ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఓవైపు పోలీసులు మరోవైపు హీరో ఈ మిస్సింగ్ కేసును చేధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె నిజంగానే మిస్ అయిందా? అయితే ఎలా మిస్సయింది? దీనికి సెర్చ్ వెర్సెస్ రివేంజ్ అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో సూర్య - ఛత్రపతి శేఖర్ - రామ్ దత్ - విష్ణు విహారి - అశోక్ వర్థన్ - వినోద్ నువ్వుల తదితరులు నటించారు. ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతం సమకూర్చారు. జనా.డి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య.జి ఎడిటింగ్ వర్క్ చేశారు.

'మిస్సింగ్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూస్తే ఒక క్వాలిటీ ఫిల్మ్ కనిపిస్తోంది. ఆర్టిస్టుల ఫర్మార్మెన్స్, టెక్నీషియన్స్ వర్క్ కనిపిస్తోంది. బడ్జెట్ చిన్నదా పెద్దదా కాదు ఓ మంచి సినిమా చేశారని చెప్పగలను. తండ్రి ప్రోత్సాహంతో వస్తున్న మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మిస్సింగ్ టైటిల్ లాగే ఈ సినిమాను ఎవరూ మిస్ అవరు అనుకుంటున్నా. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారు. సక్సెస్ మీట్ కు కూడా మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చారు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. ''గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ కరోనా వల్ల ఇబ్బందులు పడుతోంది. పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న చిత్రాల దాకా అన్నింటిమీదా ఎఫెక్ట్ పడింది. అనుకున్న డేట్స్ కు సినిమాలను రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. అందుకే మా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఎన్ని వీలైతే అన్ని సినిమాలను రిలీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఒకరికి ఒకరు అండగా నిలబడవలసిన సమయం ఇది. డైరెక్టర్ శ్రీని 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. అతను టాలెంటెడ్ టెక్నీషియన్. మిస్సింగ్ మూవీ ట్రైలర్ బాగుంది. విడుదల విషయంలో కాస్త ఓపిక పట్టండి. ఆగస్టు, సెప్టెంబర్ లో పరిస్థితి సెట్ అయితే మళ్లీ థియేటర్లకు జనం బాగా వస్తారని ఆశిస్తున్నాం. సినిమా చేయాలన్న వాళ్ల పిల్లల కలను పేరెంట్స్ నిజం చేయడం గొప్ప విషయం. మిస్సింగ్ మూవీని థ్రిల్లింగ్ గా లాస్ట్ మినట్ వరకు ఆసక్తికరంగా తీసుకెళ్లారు. మూవీ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. మ్యూజిక్ - ఆర్.ఆర్ చాలా బాగుంది. మీరు పెట్టిన డబ్బులకు థియేటర్లో మంచి రెవెన్యూ వస్తుంది'' అని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మారుతి - బన్నీ వాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ''ఇది మా మొదటి ప్రయత్నం. మా అబ్బాయిలు హీరో - దర్శకుడు అని కాకుండా.. ఓ మంచి చిత్రానికి మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము'' అన్నారు. యాక్షన్, లవ్, ఎమోషన్స్ అన్నీ కలబోసిన కథతో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ సినిమా 'మిస్సింగ్' ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Full View
Tags:    

Similar News