ఎమెల్యే తొలివిడత ఓట్ల 'కలెక్షన్'

Update: 2018-03-24 11:10 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ ఎమెల్యే భీభత్సమైన అంచనాలు లేకపోయినా చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది వచ్చిన మాస్ సినిమాగా ఓపెనింగ్స్ బాగానే రాబట్టుకుంది. కంటెంట్ విషయంలో టాక్, రివ్యూలు కొంచెం తేడాగా ఉన్నప్పటికీ మొదటి రోజు ఎమెల్యేకు ఓట్లు బాగానే పడ్డాయి. పోటీ సినిమాలు ఉన్నా కూడా దీనికి ధీటుగా నిలిచే విషయం వాటిలో లేకపోవడంతో కళ్యాణ్ రామ్ సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. నీది నాది ఒకే కథ అన్ని వర్గాలను మెప్పించే అవకాశాలు తక్కువని బిసి సెంటర్స్ ఓపెనింగ్స్ చెబుతున్నాయి. సిటిస్ వరకు మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా కాపాడుతోంది. రాజరధం డబ్బింగ్ సినిమా కావడం ఆర్య, రవి శంకర్ తప్ప ఏ ఒక్కరు తెలిసిన మొహం కాకపోవడంతో పాటు అందులో మ్యాటర్ కూడా తేడా కొట్టడంతో సైలెంట్ అయిపోయింది. ఇవన్ని ఎమెల్యేకు ప్లస్ గా మారుతున్నాయి. కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ అయితే ఎమెల్యే ఇవ్వగలిగాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎమెల్యే మొదటిరోజు సుమారు 5.2 కోట్ల గ్రాస్ తో 3.3 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్. ఎలా చూసుకున్నా ఇది డీసెంట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఇది ఇలాగే స్టడీగా వారం పాటు ఉంటేనే అందరు సేఫ్ అవుతారు. థియేట్రికల్ బిజినెస్ 13.5 కోట్ల దాకా జరిగింది. ఇందులో ఓవర్సీస్ రేట్ కలపలేదు. లాభాలు రావాలంటే 20 కోట్ల షేర్ కు కనీసం దగ్గరగా వెళ్ళాలి. బ్రేక్ ఈవెన్ కావాలన్నా 18 రావాలి. ఇప్పుడున్న టాక్ ఇలాగే కంటిన్యూ అయితే కష్టం కాని ప్రమోషన్ విషయంలో మరికాస్త ఫోకస్ పెంచితే బిసి  సెంటర్స్ లో బాగానే లాగొచ్చనేది ఒక అంచనా. అందులోనూ రంగస్థలం వచ్చే వరకు మాత్రమే ఎమెల్యేకు ఈ ఛాన్స్ ఉంటుంది. దాదాపు మొత్తం చరణ్ ఆక్రమిస్తాడు కాబట్టి ఆ లోపు వీలైనంత ఎక్కువ రాబట్టాలి .

కళ్యాణ్ రామ్ కు ఇది సవాల్ లాంటిది. గెలిచాడా మే లో వచ్చే అతని కొత్త సినిమా నా నువ్వే బిజినెస్ కి చాలా ప్లస్ అవుతుంది. ప్రస్తుతానికి పోటీ సినిమా బలంగా ఏది లేదు కాబట్టి ఎమెల్యే కాస్త గట్టిగా ప్రచారం చేసుకుంటే ఇంకాస్త ఓట్లు అదనంగా పడే అవకాశాలు ఉంటాయి. సోమవారానికి బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితని బట్టి పూర్తి కంక్లూజన్ కు రావొచ్చు. 
Tags:    

Similar News