రంగారావు పాత్రలో డైలాగ్ కింగ్?

Update: 2017-06-23 13:16 GMT
మహానటి సావిత్రి జీవిత కథను తీయడం.. ఆమె జీవితంతో ముడిపడి ఉన్న గొప్ప నటులును ఎన్నుకోవడం ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే సావిత్రి జీవితం రెండు రాష్ట్రాల మహా నటులుతో మిళితమై ఉంది. అప్పటిలో సావిత్రి కొ-స్టార్స్ గా  మన తెలుగులో ‘అన్న’ ఎన్టీఆర్ - ఏ‌ఎన్‌ ఆర్ తమిళనాడులో జెమిని గణేశ్ - శివాజీ గణేశ్ లాంటి నటులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి నటులుగా నటించాలి అంటే కత్తిమీద సాము లాంటిదే.

ఇకపోతే సావిత్రి సినిమాలలో లెక్కలేనన్ని కీలక పాత్రలు పోషించిన విశ్వ నటచక్రవర్తి ‘యెస్ వి రంగారావు’ పాత్ర కూడా చాలా కీలకం. ఈ పాత్రకు ఇప్పుడు ఒక విలక్షణ నటుడుని ఎన్నుకున్నారు సావిత్రి చిత్ర బృందం. తెలుగులో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించిన మంచు మోహన్ బాబు రంగారావు గారి పాత్రకు ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. ఇదే పాత్ర కోసం ముందర జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ను తీసుకోవాలి అనుకున్నారు కానీ ఇప్పుడు సీనులోకి మోహన్ బాబు వచ్చాడు. తెలుగు వెండితెర నటచక్రవర్తిని అభినేత్రించాలి అంటే ఈయనలాంటి అనుభవం స్టేటస్ ఉన్నవారు అయితే నిజంగానే బాగుంటుంది అని ఫిల్మ్ సర్కల్ వర్గాలు అనుకుంటున్నాయి. అయతే ఈ విషయంపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.

కీర్తి సురేశ్ మహానటి సావిత్రి పాత్రలో నటించబోతుంది. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ఇప్పటికే సావిత్రి భర్తగా జెమిని గణేశ్ పాత్రలో షూటింగ్ కూడా మొదలుపెట్టారు. సమంత - విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రదారులే. ఇప్పుడు మోహన్ బాబు కూడా జతకడితే ప్రాజెక్టు మరింత మార్కెట్ పెరిగినట్లే. నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్త్ కూతుళ్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News