బ్రేకప్‌ వల్లే సౌత్‌ సినిమాలకు దూరంః మోనాల్‌

Update: 2020-12-15 13:44 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ లో 14 వారాల పాటు కంటిన్యూ అయిన మోజాల్‌ గజ్జర్‌ మొన్న ఆదివారం బయటకు వచ్చేసింది. ఆమె ను బిగ్ బాస్ టీం స్క్రిప్ట్‌ ప్రకారం తీసుకున్నారు. దాని ప్రకారమే ఆమె బిగ్‌ బాస్‌ లో ఉంది అంటూ జనాలు అంటున్నారు. బిగ్‌ బాస్‌ టీం ఆమెను ఓట్లు పడకున్నా 14 వారాలు ఉంచారు అనేది చాలా మంది అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ఎక్కువ మంది ఎలిమినేట్‌ అవ్వడమే ఆలస్యం ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ లో సందడి చేస్తూ ఉంటారు. మోనాల్‌ కూడా ఎలిమినేట్‌ అయిన వెంటనే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది.

ఇటీవల మోనాల్‌ ఒక యూట్యూబ్‌ చానెల్‌ తో మాట్లాడుతూ సౌత్‌ సినిమాలకు దూరం అవ్వడంపై స్పందించింది. తెలుగులో నేను సినిమా చేసిన సమయంలో నాకు మలయాళం నుండి ఆఫర్‌ వచ్చింది. వేరే భాషలో చేస్తే మరింత నేర్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా సమయంలోనే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అతడి తో కొంత కాలం పాటు రిలేషన్‌ షిప్‌ కంటిన్యూ అయ్యింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. నేను ప్రేమించిన అబ్బాయి మలయాళి అందుకే నేను మళ్లీ సౌత్‌ లో అడుగు పెట్టవద్దనే ఉద్దేశ్యంతో వరుసగా గుజరాతీలో సినిమాలు ఒప్పుకున్నాను. లవ్‌ బ్రేకప్‌ వల్లే సౌత్‌ సినిమాలకు దూరంగా ఉన్నాను అంటూ క్లారిటీగా మోనాల్ చెప్పుకొచ్చింది. మళ్లీ తెలుగులో ఆఫర్లు వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు తప్పకుండా అంటూ మోనాల్‌ పేర్కొంది.
Tags:    

Similar News