టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. లైవ్ డిబేట్ లో హీరోని ఉద్దేశిస్తూ యాంకర్ కించపరిచే వ్యాఖ్యలు చేయడం.. గెటవుట్ అంటూ అవమానించడం.. అదే సమయంలో విశ్వక్ 'ఎఫ్' అనే బూతు పదాన్ని వాడటం చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంలో కొందరు యాంకర్ కు సపోర్ట్ చేస్తుండగా.. ఎక్కువ శాతం మాతృ విశ్వక్ సేన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మీడియాలో అలాంటి అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించినందుకు విశ్వక్ సేన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ మాస్ కా దాస్ ను టార్గెట్ చేస్తూ సదరు టీవీ ఛానల్ వరుస కథనాలతో విరుచుకుపడుతోంది.
'F** సేన్' అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడమే కాదు.. విశ్వక్ సేన్ మాదిరిగానే అస్వక్ సేన్ అంటూ నడిరోడ్డుపై ప్రాంక్ వీడియో చేసి ప్రసారం చేశారు. అయితే 'విశ్వక్ చేసింది న్యూసెన్స్ అయితే.. మరి ఇదేంటి?' అని నెటిజన్లు ట్రోల్ చేయడం.. బాబు గోగినేని వంటి వారు ప్రశ్నించడంతో ఈ స్పూఫ్ ప్రాంక్ వీడియోని న్యూస్ ఛానల్ వారు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
విశ్వక్ vs టీవీ యాంకర్ ఇష్యూ పై ఇండస్ట్రీ పెద్దలెవరూ స్పందించలేదు. ఇందులో టాలీవుడ్ హీరోకి మద్దతుగా నిలవలేదు. అయితే ఇద్దరు ముగ్గురు నటీనటులు, టెక్నిషియన్స్ విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలిచారు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ విషయం పై వరుస ట్వీట్స్ తో టీవీ ఛానెల్ ను ఏకిపారేశాడు.
'టీవీ9.. మీకు అసలు సిగ్గు ఉందా' అంటూ బోల్డ్ ట్వీట్ పెట్టిన రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్ లో నేను కూడా భాగం అవుదామనుకుంటున్నానని పేర్కొన్నారు. ''విశ్వక్ సేన్‌ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. టీవీ9 ఛానెల్ కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తుంది. నీచమైన రూపంలో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది'' అని ట్వీట్ చేశాడు.
టీవీ9 ఛానెల్ లో న్యూస్ తప్ప మిగతావన్నీ కవర్ చేస్తారని.. వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయంటూ సంచలన కామెంట్స్ చేశాడు రాహుల్. ఈ మొత్తం వ్యవహారం పై సదరు టీవీ ఛానెల్ లైవ్ డిబెట్ లో పాల్గొనాలని అనుకున్నానని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా మరికొన్ని ట్వీట్లు సంధించారు.
''పుకార్లు మరియు గాసిప్‌లను అమ్మడం అనేది ఒక వ్యక్తిని హత్య చేయడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం. టీవీ9 అది ఒక క్లాసిక్ జాబ్ గా చేస్తుంది" అని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. ''నా ట్వీట్లలోని అన్ని కామెంట్స్ చూస్తుంటే, ప్రజలు దీనిపై మాట్లాడారని నేను నమ్ముతున్నాను. వారు చెప్పేది/అర్థం ఏమిటంటే.. టీవీ9 అనేది చెత్త డబ్బా ఛానల్ కావచ్చు'' మరో ట్వీట్ చేసాడు రాహుల్.
''టీవీ9 వల్లే ఈ సమస్య వచ్చిందని నేను అనుకోను. అటువంటి నరమాంస భక్షకులకు ప్రభుత్వాలు ఫ్రీహ్యాండ్ ఇవ్వడం దీనికి కారణమని నేను భావిస్తున్నాను. మెసెంజరే ద్వేషాన్ని వ్యాపింపజేస్తుంటే.. ఆ మెసెంజర్ కి ఖచ్చితంగా శిక్ష అవసరమని నేను భావిస్తున్నాను'' అని అన్నారు.
''టీవీ9 గురించి ఇలా ట్వీట్ చేసినందుకు నేను మన దేశంలోని గౌరవనీయమైన న్యాయస్థానాలకు వెళ్లాలనుకుంటున్నాను. అలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. మన సమస్యలకు ప్రజలుగా మనమే నిందించుకోవాలి. ఈ అవాస్తవాన్ని సరిదిద్దడం మన బాధ్యత'' అని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. ఇకపోతే సీనియర్ హీరోయిన్ కస్తూరి - యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ - నటి కరాటే కల్యాణీ వంటి వారు కూడా విశ్వక్ కు మద్దతుగా నిలిచారు.
కస్తూరి ట్వీట్ చేస్తూ.. ‘‘నేను హిట్ సినిమా చూసినప్పటి నుంచి విశ్వక్ సేన్ ను ఇష్టపడుతున్నాను. ఈరోజు ఓ వీడియో చూశాను. దాంతో అతనిపై మరింత రెస్పెక్ట్ పెరిగింది. అసలు ఏ ప్రాంక్ చేసినా కూడా రానంత పబ్లిసిటీ TV9యే క్రియేట్ చేసింది. ఆల్ ది బెస్ట్ సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్ సేన్.. నీ కొత్త మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి కూడా ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ పరోక్షంగా ఈ ఇష్యూ పై స్పందిస్తూ.. ''వాడు మంచోడు కాబట్టి.. F***తో సరిపెట్టాడు. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని.. నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డ్స్ కి ఏ మాత్రం అతీతం కాదు.. ఫస్ట్ హ్యూమన్(మనిషి)'' అంటూ యాంకర్ దేవికి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూ విశ్వక్ కు మద్దతు తెలిపారు.
''3*3 టీవీ వర్సెస్ సేన్ వివాదంలో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ అన్నిసార్లు F పదం వాడినప్పుడు.. నువ్వు రోడ్డు మీద డ్యాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మా'' అంటూ కరాటే కళ్యాణి సెటైరికల్ పోస్ట్ పెట్టారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ సైతం పరోక్షంగా విశ్వక్ కు సపోర్ట్ చేశారు. న్యూస్ ఛానల్ లో గతంలో 'ఎఫ్' పదాన్ని వాడిన షో మరియు ఆ టీవీ పై మీమ్స్ ని షేర్ చేస్తూ ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదంపై ఎవరెవరు స్పందిస్తారో చూడాలి.