మ‌జ్ను డైరెక్ట‌ర్ కి మైత్రి ఆఫ‌ర్

Update: 2019-01-20 04:20 GMT
మైత్రి మూవీ మేక‌ర్స్ స్పీడ్ గురించి తెలిసిందే. వ‌రుస‌గా న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించేందుకు వెన‌కాడ‌ని సంస్థ ఇది. ఓవైపు అగ్ర ద‌ర్శ‌కులు- అగ్ర‌క‌థానాయ‌కుల కాంబినేష‌న్స్ తో సినిమాలు చేస్తూనే మిడ్ రేంజ్ సినిమాల‌కు మైత్రి సంస్థ స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవ‌లే రిలీజైన స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా మొక్క‌వోని ధీక్ష‌తో కొత్త పంథా సినిమాలు నిర్మించేందుకు మైత్రి సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు మైత్రి సంస్థ అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తోంది.

క‌థ‌ల ఎంపిక‌లో.. ద‌ర్శ‌కుల్ని ఫిక్స్ చేయ‌డంలో వేగంగా ఆలోచించే సంస్థగా మైత్రికి పేరొచ్చింది. అగ్ర‌నిర్మాత‌లు దిల్ రాజు, అల్లు అర‌వింద్, యువిక్రియేష‌న్స్ త‌ర్వాత ఆ త‌ర‌హాలో ఎదుగుతున్న సంస్థ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ కి పాపులారిటీ ద‌క్కింది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా `డియ‌ర్ కామ్రేడ్` చిత్రాన్ని ఈ సంస్థ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. దేవ‌ర‌కొండ‌తోనే మ‌రో ప్రాజెక్టును తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. అలాగే సాయిధ‌ర‌మ్ హీరోగా `చిత్ర‌ల‌హ‌రి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ శ్రీ‌నివాస్ పెండింగ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది చిత్రీక‌ర‌ణ పూర్తి కానుందిట‌. అలాగే మైత్రి సంస్థ‌లో ప‌ని చేసిన ప‌లువురు అసిస్టెంట్ల‌కు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. ల‌ఘు చిత్రాలు తీసే ప్ర‌తిభావంతుల‌కు మైత్రి పిలిచి మ‌రీ అవ‌కాశాలిస్తోంది. మునుముందు వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.

తాజాగా న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సంస్థ‌లో ఓ చిత్రం తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు మైత్రి నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ నిన్న‌టిరోజున `మిస్ట‌ర్ మ‌జ్ను` ట్రైల‌ర్ వేడుక‌లో అధికారికంగా ఆ సంగ‌తిని ప్ర‌క‌టించారు. `తొలి ప్రేమ` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న వెంకీ అట్లూరి త‌మ‌ బ్యాన‌ర్ లోనూ సినిమా చేస్తున్నాడ‌ని న‌వీన్ తెలిపారు. అఖిల్ హీరోగా వెంకీ తెర‌కెక్కిస్తున్న రెండో సినిమా `మిస్ట‌ర్ మ‌జ్ను` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధిస్తుంద‌ని మైత్రి నిర్మాత‌లు ఆకాంక్షించారు. మొత్తానికి ట్యాలెంట్ ను వెతికి ప‌ట్టుకోవ‌డం.. అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేయ‌డం ప్ర‌స్తుతం మైత్రి సంస్థ విలువ‌ను పెంచుతోంది. ఇత‌ర అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌కు ధీటుగా ఈ సంస్థ ఎదిగేందుకు ఈ చొర‌వ ఒక‌ నాందిగా క‌నిపిస్తోంది.

Full View

Tags:    

Similar News