తాత నుంచి డాడ్ .. డాడ్ నుంచి తనయుడికి వచ్చింది మజ్ను టైటిల్. అందుకే `మిస్టర్ మజ్ను` అన్న టైటిల్ పెట్టుకున్నందుకు అఖిల్ రొమాంటిక్ లవర్ బోయ్ గా మైమరిపించబోతున్నాడని ఫ్యాన్స్ కు అర్థమైంది. అందుకు తగ్గట్టే పోస్టర్లు - తొలి టీజర్ - పాటలు అన్నీ మిస్టర్ మజ్ను థీమ్ ని ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారు. అక్కినేని రోమియోని తెరపై చూడబోతున్నామని ఇప్పటికే రిలీజైన ప్రతి విజువల్ బిట్ మెటీరియల్ చెబుతోంది.
ఇదివరకూ కొన్ని సెకన్ల నిడివితో ఉన్న టీజర్ రిలీజై ఒక్క సారిగా అంచనాల్ని పెంచింది. అఖిల్ కి - అక్కినేని బ్రాండ్ కి పెర్ఫెక్ట్ యాప్ట్ అయిన కథ ఈసారి దొరికింది అని అభిమానులు భావించారు. తొలి ప్రేమతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని అందరికీ అర్థమైంది.
తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం అఖిల్ - నిధి అగర్వాల్ మధ్య ఫ్లిర్ట్.. లవ్ అనే కోణాన్ని ఎలివేట్ చేశారు. స్వతహాగానే చిలిపి కుర్రాడైన అఖిల్ అమ్మాయిల్ని ఫ్లిర్ట్ చేస్తూ లైన్ లో పెట్టేస్తుంటాడు. అతడికి పడని అమ్మాయే లేదు. అబద్ధాలు చెప్పి మరీ పడగొట్టేస్తుంటాడు. అలా నిధిని కూడా ఫ్లిర్ట్ చేస్తాడు. అయితే అది కేవలం కవ్వించి వదిలేసే ప్రేమ కాదని మజ్ను తెలుసుకునేప్పటికి అంతా అయిపోతుంది. అన్ని ప్రేమకథల్లానే ఈ కథలోనూ బోలెడంత డ్రామా, విరహం ఉంటుందని ట్రైలర్ చెబుతోంది. అమ్మాయిలతో ప్రేమ శాశ్వతం కాదని అందరు బోయ్స్ లానే నమ్మే మజ్నుని చివరికి నిధి గెలుచుకుందో లేదో తెరపై చూడాల్సిందే. ట్రైలర్ వరకూ ఓకే. అయితే ఈ కథలో అసలు ట్విస్టును ఏ మేరకు రక్తి కట్టించారు? ఇందులో ఫ్యామిలీ డ్రామా - యాక్షన్ - ఎమోషన్ ఏ మేరకు వర్కవుట్ అయ్యాయి? అన్నదానిని బట్టే మజ్ను ఫలితం ఉంటుందనడంలో సందేహం లేదు. థమన్ ఆర్.ఆర్ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. అయితే అఖిల్ తన తొలి రెండు చిత్రాల్లో మిస్సయిన దానిని ఈసారి మిస్ చేయకుండా.. మజ్నుగా పూర్తి స్థాయిలో ఫీల్ ని క్యారీ చేయడంలో తడబడకుండా ఉంటాడా? అన్నది చూడాలి. మిస్టర్ మజ్ను ఈనెల 25న రిలీజవుతోంది.
Full View