'గద్దలకొండ గణేశ్' సినిమా చూసినవారికి 'మృణాళిని రవి' గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ - పూజా హెగ్డే ఒక జోడీగా కనిపిస్తే, అధర్వ - మృణాళిని రవి మరో జంటగా కనిపిస్తారు. ఈ సినిమాలో ఆమె బుజ్జమ్మ పాత్రలో పల్లెటూరి పిల్లగా ఆకట్టుకుంది. అందంగా .. ఆకర్షణీయంగా కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ సినిమా హిట్ కావడంతో, ఇక ఈ అమ్మాయి మరిన్ని సినిమాలు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. తెలుగులో కుర్ర హీరోల జోడీగా సందడి చేయడానికి మరో కొత్త పిల్ల దొరికేసిందని భావించారు. కానీ ఆ సినిమా తరువాత మళ్లీ ఈ అమ్మాయి కనిపించలేదు.
ఇటీవల కాలంలో తెలుగులో యువ హీరోల ప్రాజెక్టులు చాలానే పట్టాలెక్కాయి. కానీ ఏ ప్రాజెక్టులోను మృణాళిని రవి పేరు వినిపించలేదు. కనీసం రెండవ హీరోయిన్ గా కూడా ఈ అమ్మాయి పేరు కనిపించడం లేదు. తెలుగులో చేయడం లేదుకదా అని ఈ అమ్మాయి ఖాళీగా ఉందని అనుకుంటే పొరపాటే. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమా హిట్ తరువాత, ఈ అమ్మాయికి ఇక్కడ ఎలాంటి ఆఫర్లు రాలేదు. దాంతో సహజంగానే కోలీవుడ్లో ట్రై చేసింది. అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ప్రస్తుతం మృణాళిని రవి చేతిలో నాలుగు తమిళ సినిమాలు .. ఒక కన్నడ సినిమా ఉన్నాయి. హిందీలోను ఆమె ఒక సినిమా చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తమిళంలో ఆమె 'ఎంజీఆర్ మగన్' .. 'జంగో' .. 'కోబ్రా' .. 'ఎనిమీ' సినిమాలు చేస్తోంది. వివిధ జోనర్లలో రూపొందుతున్న ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకకుల ముందుకు రానుండటం విశేషం. ఇక కన్నడలో చేసిన 'పొగరు' సినిమా కూడా వచ్చేనెల 19వ తేదీన థియేటర్లకు రానుంది. ధ్రువ సర్జా హీరోగా చేసిన ఈ సినిమాలో ప్రధాన నాయికగా రష్మిక మందన కనిపించనుంది. వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలు, మృణాళిని రవి సక్సెస్ గ్రాఫ్ ను పెంచుతాయేమో చూడాలి.