థియేటర్లు తెరుస్తాం.. అనుమతివ్వండి

Update: 2020-09-15 17:33 GMT
కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డ థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. అన్నింటిని అన్ లాక్ పేరిట ఓపెన్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్లకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మల్టీపెక్స్ అసోసియేషన్ తాజాగా విజ్ఞప్తి చేసింది. గత ఆరు నెలల్లో లక్షలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపింది.

దాదాపు 9 వేల కోట్ల రూపాయాలు సినిమా థియేటర్ల రంగం నష్టపోయిందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ తాజాగా లేఖలో కోరింది. 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారని విన్నవించింది. ‘అన్ లాక్ సినిమాస్ అండ్ సేవ్ జాబ్స్’ అంటూ స్పెషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది.

అన్ లాక్ 4లో భాగంగా మాల్స్, ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, రెస్టారెంట్లు, జిమ్ లు కూడా ఓపెన్ అయ్యాయని.. థియేటర్స్ కు ఎందుకు అనుమతివ్వడం లేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కేంద్రాన్ని ప్రశ్నించింది.

తాము థియేటర్లలో అన్ని రకాల జాగ్రత్తలు, శానిటైజేషన్ చేస్తామని.. సినిమా హాళ్లను తెరిపించాలని కేంద్రాన్ని అసోసియేషన్ కోరింది.

ఇప్పటికే చైనా, కొరియా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర 12 దేశాల్లో థియేటర్లు నడుస్తున్నాయని తెలిపింది. భారత్ లో కూడా సినిమా హాళ్లు తెరిపించి ఆర్థికంగా తమను ఆదుకోవాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
Tags:    

Similar News