ఆ మధ్య మీలో ఎవరు కోటీశ్వరుడుతో హీరో డెబ్యు చేసిన థర్టీ ఇయర్స్ పృథ్వి మరోసారి అలాంటి ప్రయత్నంతో వస్తున్నాడు . మై డియర్ మార్తాండం పేరుతో హరీష్ కెవి దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ట్రైలర్ విడుదలైంది.
అమాయకత్వం నింపుకున్న ఓ ఏజ్ బార్ లాయర్ మార్తాండం(పృథ్వి) ఏది రైటో ఏదో రాంగో తెలియని అమాయకత్వంతో కేసులు వాదిస్తూ ఉంటాడు. తన స్థాయికి మించి ఓ మర్డర్ కేసు ఒప్పుకుంటాడు. అయితే అందులో ఒక ప్రేమ జంట చిక్కుకుని ఉంటుంది. అపోజిషన్ లాయర్(కృష్ణ భగవాన్)తనకు సవాల్ విసురుతున్నా భయపడకుండా రిస్క్ నెత్తి మీద వేసుకుంటాడు. ఇతని ప్రవర్తన జడ్జ్(జయప్రకాశ్ రెడ్డి)కు సైతం చికాకు తెప్పిస్తూ ఉంటుంది. మరి మార్తాండం ఈ సవాల్ ను ఎలా ఎదురుకున్నాడు అనేదే కథ
ట్రైలర్ చూస్తే భారం మొత్తం పృథ్వి కామెడీ టైమింగ్ మీదే ఆధారపడినట్టు కనిపిస్తోంది. తన పంచులతో నవ్వులు పూయించే ప్రయత్నం గట్టిగానే చేసాడు. హాలీవుడ్ మూవీ మై కజిన్ విన్నీ స్ఫూర్తితో రూపొందిన ఈ మూవీలో తాగుబోతు రమేష్ మరో కీలక పాత్ర చేయగా రాకేందు మౌళి-కల్పిక గణేష్ యంగ్ పెయిర్ గా కనిపించారు. పెద్దగా ఆసక్తి రేపెలా ఉందని చెప్పలేం కానీ ఏదో టైం పాస్ కామెడీ చేయించే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది.
మై డియర్ మార్తాండం పేరుతో పాతికేళ్ళ క్రితం తమిళ హీరో ప్రభుది ఓ సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇప్పుడు మళ్ళి పృథ్వి కోసం రిపీట్ చేసాడు. పవన్ సంగీతం అందించిన ఈ మూవీకి సయ్యద్ నిజాముద్దీన్ నిర్మాత. చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు తక్కువగా ఉన్న ఈ లాయర్ కామెడీ ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి
Full View