# క్లిప్స్ లీక్.. అదంతా ఔత్సాహికుల ప‌నేనా?

Update: 2021-08-16 06:19 GMT
క్రేజీ కాంబినేష‌న్స్ పై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా లాంచ్ మొద‌లు.. రిలీజయ్యే వ‌ర‌కూ ప్ర‌చార హంగామాతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతాయి. రిలీజ్ త‌ర్వాత సినిమా ఎలా ఉన్నా! దానికి ముందు చేసే హ‌డావుడి పై ఒక‌టే క్యూరియాసిటీ నెల‌కొంటుంది. సినిమా అప్ డేట్స్ కోసం ప్రేక్ష‌కాభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ కొన‌సాగుతుంది. అలాంటి స‌మ‌యంలో ముందే లీకుల రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తే ఆ క్యూరిసీటీ రెట్టింపు అవుతుంది. కంటెంట్ ఏం ఉందో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి మ‌రింత పెరుగుతుంది.

స‌రిగ్గా పాన్ ఇండియా మూవీ `బాహుబ‌లి` విష‌యంలో ఇదే జ‌రిగింది. బాహుబ‌లి ఆన్ సెట్స్ లో ఉన్న స‌మ‌యంలో కొన్ని సీన్లు లీక‌వ్వ‌డంతో సినిమా ఎలా ఉంటుందోన‌న్న ఆస‌క్తి అభిమానుల్లో రెట్టింపు చేసింది.  ఆ లీకుల ద్వారా సినిమాకు వ‌చ్చిన బ‌జ్ అసాధార‌ణ‌మైన‌ది. అనుకున్న‌దానికంటే అంత‌కు మించి ఏదో ఉంద‌న్న ఆత్రుత అంద‌రిలోనూ మొద‌లైంది. `బాహుబ‌లి`కి ఆ ర‌కంగా కోట్లాది రూపాయ‌ల ప‌బ్లిసిటీ ఉచితంగా ల‌భించిన‌ట్ల‌యింది. నిజానికి లీకుల రూపంలో ఆ సీన్లు బ‌య‌ట‌కు రాక‌పోతే అంత బ‌జ్ ఉండేదా? అన్న ప్ర‌శ్న గ‌తంలోనే రెయిజ్ అయింది.

అప్ప‌ట్లో అర‌వింద స‌మేత చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో నాగ‌బాబు పై యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆద్యంతం బిగ్ లీక్స్ చిత్ర‌బృందాన్ని క‌ల‌వ‌ర‌పెట్టాయ‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఆ లీకులు కూడా ఆ సినిమా విజ‌యానికి క‌లిసొచ్చాయి. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ అత్తారింటికి దారేది స‌గ‌భాగం లీకైపోవ‌డంతో అది ఆందోళ‌న క‌లిగించినా దానివ‌ల్ల ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేంత ప్ర‌చారం ద‌క్కింది. అప్ప‌ట్లో నిర్మాత బివిఎస్ ఎన్ కి గుండె నొప్పి వ‌చ్చింది. అది ప‌బ్లిసిటీ స్టంట్ కాదు. కుట్ర‌దారు లీక్ వ‌ల్ల అలా అవ్వ‌డంతో సైబ‌ర్ క్రైమ్ లోనూ ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఆ సినిమాకి ప్ర‌చారం బాగా వ‌ర్క‌వుటైంది.

ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ న‌టించిన `గీతా గోవిందం`..`టాక్సీవాలా` విష‌యంలోనూ ఇదే స‌న్నివేశం రిపీట్ అయింది. ఆ త‌ర్వాత నిర్మాత‌లు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదులు చేయ‌డం తెలిసిందే. తాజాగా  మ‌హేష్ న‌టిస్తోన్న‌ `స‌ర్కారు వారి పాట` బ్లాస్ట‌ర్  టీమ్ రిలీజ్ చేస్తుంది అన‌గానే కొన్ని గంట‌ల ముందే ఆన్ లైన్ లో లీకైంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న `పుష్ప` సాంగ్ రిలీజ్ అవ్వ‌డం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత  స‌రిగ్గా భీమ్లా నాయ‌క్ ఇంట్రో వీడియో రిలీజ్ అయ్యే కొద్ది క్ష‌ణాల ముందే `పుష్ప` ఫైట్ సీన్ లీక‌వ్వ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే ఇదంతా ముందే ప్లాన్ చేసిన‌  ప‌బ్లిసిటీ స్టంట్ అన్న అనుమానాన్ని ప‌లువురు అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇది ప‌బ్లిసిటీ స్టంట్ అనుకోవ‌డానికి పూర్తిగా ఆస్కారం లేదు. ఆఫీస్ లో కొంద‌రు చేసే లీకులు.. అత్యుత్సాహం అయ్యుండొచ్చ‌న్న అనుమానం కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. పుష్ప‌.. స‌ర్కార్ వారి పాట లీకులపై ఇప్ప‌టికే మైత్రి సంస్థ సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది. అంటే ఇది ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ అనుకోవ‌డానికి లేదు. కొంద‌రు ఔత్సాహికుల ప‌నే అని కూడా భావించాల్సి ఉంటుందేమో!

అయితే వేరొక సెక్ష‌న్ ఆలోచ‌న ప‌రిశీలిస్తే.. ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ప‌నులు అనే విమ‌ర్శ ఉన్నా ఔత్సాహికుల అత్యుత్సాహం తెచ్చిన ముప్పు అని కూడా విశ్లేషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అధికారికంగా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌ వ‌చ్చే మైలేజ్ క‌న్నా లీకుల ద్వారా వ‌చ్చే మైలేజ్ ఎక్కువ. అలా అయితేనే విప‌రీతంగా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో నానుతుంద‌న్న ఆలోచ‌న  చేస్తున్నార‌నే వాద‌నను ఒక సెక్ష‌న్ బ‌లంగా వినిపిస్తోంది. కార‌ణాలు ఏవైనా చిన్న చిన్న లీకుల వ‌ల్ల న‌ష్టం క‌న్నా లాభాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా య‌ని అంద‌రి హీరోల అభిమానులు సైతం అభిప్రాప‌డుతున్నారు. ఇంత‌కీ ఇటీవ‌లి లీకుల‌న్నీ కావాల‌ని చేసిన‌వేనా...! అలాంట‌ప్పుడు సైబ‌ర్ క్రైమ్ అంటూ హ‌డావుడి దేనికి..? అంటూ కొంద‌రు ప్ర‌శ్న‌ల్ని సంధిస్తున్నారు. నిజానికి కావాల‌ని లీక్ చేసి క్రైమ్ పోలీస్ కి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం ఏమిటి.. అన్న‌ది ఆలోచించాలి.

ఇలాంటి లీకుల ప్ర‌చారం వ‌ల్ల నెగెటివిటీ లేదా? అంటే ఎందుకు ఉండ‌దు. కొన్నిసార్లు క‌థేంటో తెలిసిపోతే హీరో పాత్ర లీకైపోతే ఇందులో కొత్తేమీ లేదు అనుకుని జ‌నం పొర‌బ‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. క్యూరియాసిటీ ఎలిమెంట్ ముందే తెలిస్తే అది ప్ర‌మాద‌క‌రం. దానివ‌ల్ల డ్యామేజీ త‌ప్ప‌దు. అలాంట‌ప్పుడు ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు కావాల‌ని త‌మ సినిమాల క్లిప్పింగుల‌ను లీక్ చేయ‌వు క‌దా! నాణేనికి బొమ్మ బొరుసు ఉన్న‌ట్టే ఇందులో రెండు కోణాలు ఆలోచించాలి.
Tags:    

Similar News