ఒక్కో సినిమాకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ హీరోలు చాలామందే ఉంటారు. 20.. 30.. 50 కోట్ల చొప్పున అందుకున్నారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడా లెక్కలన్నీ సరిచేసేస్తున్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నమోదు చేస్తున్నాడట పవర్ స్టార్.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ స్టార్ట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కు సినిమా చేయనున్నాడని ఇప్పటికే చెప్పుకున్నాం. ఆర్టీ నీసన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఏఎం రత్నం సినిమాను కొన్నాళ్లు పక్కన పెట్టి మరీ.. మైత్రీ బ్యానర్ కు డేట్స్ ఇచ్చాడట పవన్. ఇందుకు కారణం.. పవన్ కు ఆఫర్ చేసిన పారితోషికమే అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కు 40 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేయగా.. ఇందుకు ప్రతిగా పవన్ తన కాల్షీట్స్ 40 రోజులు మాత్రమే ఇస్తాడట.
అంటే రోజుకో కోటి చొప్పున పారితోషికం అందుకునే హీరోగా పవన్ కళ్యాణ్ ఓ తిరుగులేని రికార్డ్ నమోదు చేయబోతున్నాడు. ఇండియాలో ఏ స్టార్ హీరో కూడా ఇప్పటివరకూ ఈ స్థాయిలో అందుకోలేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను.. 2018 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్ లోపు శరవేగంగా వీలైనన్ని సినిమాలు చేసేసి.. కాసిన్ని డబ్బులు చేసుకోవాలనే టార్గెట్ లో భాగమే ఇదంతా అనే టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/