ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు లైన్ లో పెట్టారు. హీరోలతో పాటుగా అగ్ర దర్శకులను కూడా లాక్ చేసి పెడుతున్నారు. సినిమా ఎప్పుడు చేస్తారనేది పక్కన పెడితే, అందరికీ అడ్వాన్సులు ఇచ్చి ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటున్నారు. ఒక వైపు మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర ఇండస్ట్రీలలో కూడా అడుగుపెట్టాలని చూస్తున్న మైత్రీ టీమ్.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరిపిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.. దాదాపు 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మైత్రీ టీమ్ కు కండలవీరుడు 2023 లో డేట్స్ కేటాయించనున్నారట. దీంతో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సరైన స్క్రిప్ట్ మరియు దర్శకుడి కోసం ప్రొడ్యూసర్స్ వెతుకులాట ప్రారంభించారట. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ని పరిశీలించినప్పటికి.. అందరూ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు.
మైత్రీ టీమ్ తో ఆల్రెడీ వర్క్ చేసిన సుకుమార్ - కొరటాల శివ వంటి దర్శకులతో పాటుగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ను కూడా సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ కోసంల్ పరిగణిస్తున్నారట. కాకపోతే వీరు ముగ్గురూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సైన్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సల్మాన్ కోసం సరైన స్క్రిప్ట్ రెడీ చేయగలిగే డైరెక్టర్ దొరికితే అడ్వాన్స్ ఇవ్వాలని నిర్మాతలు చూస్తున్నారట. ఏదేమైనా మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ లో ఎంటర్ అవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
ఇప్పటికే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు - సితార ఎంటర్టైన్మెంట్స్ రాధాకృష్ణ తదితరులు బాలీవుడ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మైట్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ కూడా హిందీ పరిశ్రమపై ఫోకస్ పెడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రస్తుతం డజన్ కు పైగా ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' 1&2 చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అలానే మహేష్ బాబుతో కలసి పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు.
నాని హీరోగా 'అంటే సుందరానికీ!' సినిమా.. నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇటీవలే నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో '#NBK107' ప్రాజెక్ట్ కు అధికారిక ప్రకటన వచ్చింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో '#NTR31' అనౌన్స్ మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో అప్పుడెప్పుడో '#PSPK28' చిత్రాన్ని ప్రకటించారు. ఇక చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఓ మూవీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ లో ఇన్ని పెద్ద సినిమాల నిర్మాణం చేస్తున్న మరో ప్రొడక్షన్ హౌస్ లేదనే చెప్పాలి.