సమ్మర్ సీజన్ ఎంత వేడిగా ఉందో రానున్న రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల సమరం అంత కన్నా ఎక్కువ వేడి రాజేసేలా ఉంది. విడుదలకు నాలుగు నెలల ముందే టీజర్ విడుదల చేసి సంచలనం రేపిన అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రమోషన్ వేగాన్ని పెంచబోతోంది. ఈ మధ్య పూర్తిగా సైలెంట్ అయిపోయిన సూర్య మళ్ళి తన గొంతును లేపబోతున్నాడు. రంగస్థలం విడుదల, తమ కంటే ముందు వస్తున్న భరత్ అనే నేనుకు కొంత స్పేస్ ఇవ్వడం లాంటి కారణాల వల్ల ఇన్నాళ్ళు వేచి చూసిన నా పేరు సూర్య యూనిట్ ఇప్పుడు సీరియస్ గా రంగంలోకి దిగే ప్లానింగ్ లో ఉంది. విడుదలకు ఒక రోజు అదనంగా కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉండటంతో ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో కిక్ స్టార్ట్ చేసేలా డిసైడ్ అయ్యారని టాక్.
విశ్వసనీయ సమాచారం మేరకు నా పేరు సూర్య వేడుకను ఏప్రిల్ 15న గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాతలు లగడపాటి శ్రీధర్-బన్నీ వాసు-నాగబాబు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. కాని ఎక్కడ నిర్వహించాలి అనే దాని గురించి మాత్రం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. రంగస్థలం వైజాగ్ లో చేసారు కనక మళ్ళి అక్కడే నిర్వహిస్తే ఇతర ప్రాంతాల మెగా ఫాన్స్ వివక్ష అనుకునే అవకాశం ఉంది. పోనీ హైదరాబాద్ అంటే రొటీన్ అయిపోతోంది కాబట్టి వినూత్నంగా రాయలసీమ ప్రాంతాల్లో చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు టాక్. అలా జరిగే పక్షంలో తిరుపతి లేదా కర్నూల్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయి.
తిరుపతిలో ఇంద్ర సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని ఎవరూ మర్చిపోలేరు. అలాగే కర్నూల్ లో జరిగిన చూడాలని ఉంది వంద రోజుల వేడుక సైతం అప్పట్లో ఘనంగా జరిగింది. ఈ రెండు నగరాలు మినహాయించి కడప - అనంతపూర్ లాంటివి సినిమా వేడుకలకు అంత అనుకూలంగా ఉండవు కనక ఈ వారంలోనే డెసిషన్ తీసుకుని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ మే 4 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.