మనకు మహానటి అనే పేరు వినగానే సావిత్రి కళ్ల ముందు మెదులుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బిరుదు తగిన మరో హీరోయిన్ ఇండస్ట్రీలో కనిపించలేదు. అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయిన ఆ మహనీయురాలి జీవితంపై సినిమా తీసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ రెడీ అవుతున్నాడు.
ఎవడే సుబ్రమణ్యం మూవీతో విమర్శకుల మెప్పు కూడా సంపాదించిన నాగ్ అశ్విన్.. సావిత్రిపై తీయబోతున్న చిత్రానికి 'మహానటి' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసుకున్నట్లు చెప్పాడు. 'ఇప్పటికే మహానటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశాను, త్వరలో క్యాస్టింగ్ ప్రారంభిస్తాం. చేతిలో పైసా లేని స్థాయి నుంచి ఓ సూపర్ స్టార్ గా ఎదిగిన సావిత్రి జీవితం ఓ మహా కథ లాంటిది. అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా సినిమాను పక్కాగా తెరకెక్కిస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్.
'సావిత్రి జీవితంలో ఎన్నో మైలురాళ్లు - కీలక ఘట్టాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఓ వివాదంగానో - విషాదంగానో చూపించాలని అనుకోవడం లేదు. ఓ పండుగలాగా ఈ సినిమా రూపొందిచాలని కోరుకుంటున్నా. ఆమె జీవితంలోని మధుర క్షణాలను తెరకెక్కించబోతున్నాం' అని చెప్పాడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు గత ఆరు నెలలుగా పరిశోదన సాగించిన ఈ డైరెక్టర్.. ఎంతోమంది జర్నలిస్టులను కలవడంతో పాటు.. ఎన్నెన్నో పుస్తకాలు - ఆర్టికల్స్ చదివానని చెప్పాడు.