నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది ఘోస్ట్. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది ఘోస్ట్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం సినిమా ప్రమోషనల్ స్టఫ్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది.
సినిమాలో నాగార్జునకి జోడీగా సోనాల్ చౌహాన్ నటించిన విషయం తెల్సిందే. రేపు సినిమాలోని నాగ్.. సోనాల్ చౌహాన్ ల యొక్క రొమాంటిక్ నెంబర్ వేగం లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రమో చూస్తుంటే సోనాల్ చౌహాన్ ఫుల్ రొమాంటిక్ గా పాటలో కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.
20 సెకన్ల ప్రోమోతో పాటపై ఆసక్తిని రేకెత్తించారు. సినిమా లో ఈ పాట హైలైట్ గా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ది ఘోస్ట్ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో మాదిరిగా పాటలు ఉండవని.. కానీ ఉన్న పాటలు తప్పకుండా ఆకట్టుకుంటాయి అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ పాటకు సంగీతాన్ని భరత్ మరియు సౌరబ్ లు అందించారు. కృష్ణ మాదినేని సాహిత్యం అందించగా కపిల్ కపిలన్ మరియు రమ్య బెహరా లు ఆలపించారు.
పాట చిత్రీకరణ కన్నుల విందుగా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. ది ఘోస్ట్ దసరా సందర్భంగా విడుదల అవుతున్న విషయం తెల్సిందే.
అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. చిరంజీవి మరియు నాగార్జున ల సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్న నేపథ్యంలో అందరూ ఏం జరగబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View