అక్కినేని నాగ చైతన్యకు టైం ఏమి బాగాలేదు. కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా టాలెంటెడ్ దర్శకులతో ఏరికోరి చేస్తున్నా ఫైనల్ గా చేదు ఫలితాలే దక్కుతున్నాయి. సవ్యసాచి చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ ఫైనల్ గా ఫ్లాప్ అని ట్రేడ్ తేల్చేయడంతో ఇక కోలుకోవడం కష్టంగానే ఉంది. వీక్ ఎండ్ వల్ల నిన్నటి దాకా ఓ మాదిరి వసూళ్లు వచ్చినా అసలైన అగ్ని పరీక్ష లాంటి సోమవారం అంటే ఈ రోజు నుంచి డ్రాప్ భారీగా ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. పికప్ మాట పక్కన పెడితే పూర్తి రికవరీ సవ్యసాచి చేయలేడు అన్నది మాత్రం వాస్తవం.
ఇది అభిమానులను సైతం తీవ్రంగా నిరాశ పరిచింది. ఎందుకంటే ఒక రోలో ఇది చైతుకి హ్యాట్రిక్ డిజాస్టర్. ఇంతకు ముందు రెండు నెలల ముందే వచ్చిన శైలజారెడ్డి అల్లుడు ఆరంభశూరత్వంలా మొదటి రెండు రోజులు బాగా సందడి చేసి ఆ తర్వాత అమాంతం నీళ్ళు చల్లిన చిచ్చుబుడ్డిలా ఆరిపోయింది. ఒకటి రెండు చోట్లా మినహాయిస్తే రీజనబుల్ రేట్లకు అమ్మినా బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఇక గత ఏడాది వచ్చిన యుద్ధం శరణం సంగతి సరేసరి. అది వచ్చిన సంగతి ఫ్యాన్స్ కు తప్ప సాధారణ ప్రేక్షకులకు గుర్తు లేదంటే అతిశయోక్తి కాదు. అంత దారుణ ఫలితం అందుకుంది. సో సిరీస్ లో హ్యాట్రిక్ అయితే పూర్తయ్యింది.
చైతు ప్రస్తుతం సమంతాతో మనం తర్వాత నటిస్తున్న మజిలి(వర్కింగ్ టైటిల్)లో బిజీ గా ఉన్నాడు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఒకరికి ఒకరు అసలు పడని భార్యభర్తల పాత్రలలో చైతు సామ్ కనిపించనున్నారు. మాస్ టచ్ ఉన్న మూడు సినిమాలు దెబ్బ తిన్న నేపధ్యంలో చైతు తిరిగి తన ఓల్డ్ స్కూల్ లోకి వెళ్ళిపోతున్నాడు. మార్కెట్ ను పెంచుకుని ఎలాగైనా 30 కోట్ల రేంజ్ ని దాటాలని విశ్వప్రయత్నం చేస్తున్న చైతు అది అందని ద్రాక్ష గానే మిగిలిపోతోంది. మరోవైపు పోటీ హీరోలు పది సినిమాలు దాటకుండానే ఈ ఫీట్ సాదిస్తే పరిశ్రమకు వచ్చి తొమ్మిదేళ్ళు అవుతున్నా తానింకా వెనుకబడే ఉండటం చైతుకైనా ఇబ్బంది కలిగించే అంశమేగా.