యంగ్ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ `థాంక్యూ`. విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. రాశీఖన్నా, మళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటించారు. ఓ యువకుడి జీవన ప్రయాణం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథగా ఈ మూవీని రూపొందించారు. జూలై 22న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా భవితవ్యం తేలనున్న నేపథ్యంలో చైతూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట.
వివరాల్లోకి వెళితే.. `థాంక్యూ` మూవీ రిలీజ్ నేపథ్యంలో పలు మీడియాలతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు హీరో నాగచైతన్య. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేయబోయే సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలని వెల్లడించారు. `థాంక్యూ` మూవీ తరువాత నాగచైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. బేబమ్మ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. ఈ మూవీలో తన పాత్ర ఎలా వుంటుంది? . ఇంతకీ తన క్యారెక్టర్ ఏంటీ? అనే వివరాల్ని తాజాగా నాగచైతన్య వెల్లడించారు. `థాంక్యూ` ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన నాగచైతన్య .. వెంకట్ ప్రభు మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని, నా స్టైల్లో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ అని వెల్లడించాడు.
ఈ విషయం తెలిసి నాగచైతన్య ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందట. కారణం గతంలో గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేసిన `సాహసం శ్వాసగా సాగిపో` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడమే. రోడ్ ట్రిప్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో హీరో నాగచైతన్య ముందు జులాయి స్టూడెంట్ గా కనిపించి ఆ తరువాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారతాడు. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ రూపొందించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
మళ్లీ పోలీస్ కథ అంటే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. అంతే కాకుండా ఇటీవల విడుదలైన పోలీస్ కథలు పెద్దగా ఆడటం లేదు. ఇది కూడా ఫ్యాన్స్ భయానికి ఓ కారణంగా తెలుస్తోంది. డిఫరెంట్ మూవీస్ తో కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ సాఫీగా సాగుతున్న ప్రయాణాన్ని పోలీస్ స్టోరీతో ఇబ్బంది పడటం ఎందుకని చై ఫ్యాన్స్ అంటున్నారట.
రీసెంట్ గా తమిళ దర్శకుడు చేసిన పోలీస్ స్టోరీ `వారియర్` ఫలితాన్ని చూసి మరింతగా బెంబేలెత్తిపోతున్నారట. కానీ చైతూ మాత్రం ఈ మూవీ కొత్తగా వుంటుందని, `మా నాడు`కు ముందే ఈ కథ విన్నానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.