తొలి సినిమాతోనే సూపర్ అనిపించాడు నాగ శౌర్య. తెలుగు సినిమా కథానాయకుడికి కావల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. 'ఊహలు గుసగుసలాడే’తో పరిచయమైన నాగశౌర్య ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘లక్ష్మీరావే మా ఇంటికి’ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకొన్నాడు. ‘జాదూగాడు’తో యాక్షన్‌బాట పట్టారు. జనవరి 1 న ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ముద్దుల గురించి మాత్రం మనోడు ఒక డెసిషన్ తీసుకున్నాడట.
''దర్శకుడు రమేష్ వర్మ అబ్బాయితో అమ్మాయి పోస్టర్లను అలా డిజైన్ చేశారే తప్ప.. ఇందులో మాత్రం కిస్సింగ్ సీన్లు మాత్రం లేవు. భవిష్యత్తులోనూ ఆ తరహా సన్నివేశాల్లో నటించను. సెంటిమెంట్ పరంగా నాకు ముద్దు కలిసి రాలేదు. ‘జాదూగాడు’లో ముద్దు సన్నివేశం చేశాను. కానీ ఆ చిత్రం సరైన ఫలితాన్నివ్వలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు నాగ శౌర్య. పేరుకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నా కూడా.. ఇక మీదట మనోడు ముద్దులు అనేవి పెట్టడన్నమాట. సో శాడ్. పాపం అమ్మాయిలు ఏమైపోతారో!!!