శివ సినిమా వచ్చి అప్పుడే 29 ఏళ్లు గడిచిపోయాయంటే ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. అలాగే అప్పట్లో నేను నటించిన `నిన్నే పెళ్లాడతా` కూడా సంచలన విజయం సాధించింది. ఈ మూవీ దేవీ థియేటర్ లో `కోటి` వసూలు చేసి రికార్డ్ సృష్టించిందని తెలిపారు నాగార్జున. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో నాగార్జున- నాని నటించిన `దేవదాస్` చక్కని వసూళ్లు చేస్తున్నాయన్న సమాచారం ఉంది. అంతే కాదు.. కేవలం తొలి వారంలో దేవదాస్ ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల గ్రాస్ వసూలు చేసి - రెండో వారంలో అడుగుపెట్టిందని నాగార్జున తెలిపారు.
నిన్నటికి నిన్న విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన నాగార్జున ఆ వెంటనే దేవదాస్ సక్సెస్ మీట్ లో పాల్గొనడం విశేషం. ఈ విజయంలో మెజారిటీ పార్ట్ క్రెడిట్ దాస్ కే ఇచ్చాడు కింగ్. డాక్టర్ దాస్ గా నాని అద్భుతంగా నటించాడు. ఇప్పుడు ఆయన వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు మంచి భవిష్యత్తు ఉంది. దేవాగా నన్ను బాగా చూపించాడు. ఇక నిర్మాత అశ్వినీదత్ నేను ఆఖరి పోరాటం సినిమా చేసినపుడు ఎంత ప్యాషన్ తో ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నారు`` అని ప్రశంసలు కురిపించారు. సెప్టెంబర్, అక్టోబర్ నాకు నా కుటుంబానికి ఎప్పుడూ కలిసి వస్తాయని నాగార్జున అన్నారు.
ఇక ఇదే ఉత్సాహంలో తదుపరి నటించే సినిమాల కోసం నాగార్జున సన్నాహకాల్లో ఉన్నారట. దేవదాస్ కర్నాటక నుంచి ఏకంగా 2.37 కోట్లు వసూలు చేసిందని అశ్వనిదత్ ఈ వేడుకలో తెలిపారు. నా బ్యానర్‌లోనే ఎక్కువ సినిమాలు చేసిన నాగార్జునకు కృతజ్ఞతలు అని దత్ అన్నారు. మొత్తానికి ఈ రిజల్ట్ తో నాగ్ - అశ్వనిదత్ ఆనందంగానే ఉన్నారని అర్థమవుతోంది. నేడు రిలీజైన రెండు సినిమాలు సోసోనే అన్న మాట వినిపిస్తోంది కాబట్టి, అది `దేవదాస్` పుంజుకోవడానికి కలిసొస్తుందేమో చూడాలి.