ఫస్ట్ లుక్: ఆఫీసర్ నాగ్ ఓకే కాని

Update: 2018-02-27 11:52 GMT
అక్కినేని నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కాంబోలో చాలా ఏళ్ళ తర్వాత తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శ్రీదేవి అకాల మరణం వల్ల కొద్దిగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నిజానికి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం శ్రీదేవి దుర్ఘటన జరగకపోయి ఉంటె ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అధికారికంగా మొన్నే విడుదలయ్యేది. కాని వర్మ విపరీతంగా అభిమానించే ఏకైక నటి శ్రీదేవి అనుకోకుండా స్వర్గస్తులు కావడం, దానికి వర్మ గుండె పగిలే శోకంతో ట్విట్టర్ లో తన ఆవేదన మెసేజ్ ల రూపంలో కురిపించడం గత యాబై గంటలుగా కొనసాగుతూనే ఉంది.  వాటికి బ్రేక్ ఇస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అధికారికంగా విడుదల చేసింది సినిమా యూనిట్. 

ఆఫీసర్ టైటిల్ ఫిక్స్ చేసిన ఈ మూవీలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇందులో రివాల్వర్ పట్టుకున్న నాగ్ సీరియస్ లుక్ ఫాన్స్ కి భలే కిక్ ఇస్తోంది. శివమణి సినిమా తర్వాత నాగ్ సీరియస్ పోలీస్ గా మళ్ళి కనిపించలేదు. ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ ఆఫీసర్ లో మరోసారి కనిపిస్తున్నాడు. బ్యాక్ డ్రాప్ పోలీస్ అయినప్పటికీ మంచి రివెంజ్ డ్రామా ఇందులో ఉంటుందని టాక్. తొలుత గన్, సిస్టం అని ఏవేవో టైటిల్స్ అనుకున్నారు కాని ఫైనల్ గా ఆఫీసర్ కు ఫిక్స్ అయ్యారు.

ఫస్ట్ లుక్ అదుర్స్ అనే రేంజ్ లో అయితే లేదు. ఏ పాత్ర చేసినా నాగ్ ను ఇప్పటి దాకా దర్శకులు గ్లామరస్ గానే చూపించారు. మన్మధుడు అనే ట్యాగ్ కి ఇప్పటికీ న్యాయం చేస్తున్న నాగ్ ను వర్మ మాత్రం చాలా సీరియస్ గా వయసు మళ్ళిన వాడిలా చూపించడం కొంత నెగటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. క్యాప్షన్ లో ఇలాంటి భయపెట్టే పోలీసుని చూసి ఉండరు అంటున్న వర్మ కంటెంట్ లో కూడా అది ప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్మ క్రియేటివిటీ చాలా ఏళ్ళుగా పోస్టర్స్ దగ్గరే ఆగిపోతోంది. మరి ఆఫీసర్ దానికి భిన్నంగా ఉంటుంది అనే హామీ అయితే ప్రస్తుతానికి ఈ పోస్టర్ లో కనిపించడం లేదు.

శివ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన తర్వాత వర్మ నాగ్ తో తీసింది రెండు సినిమాలు. అంతం, గోవిందా గోవిందా రెండు డిజాస్టర్స్ గా మిగిలాయి. కౌంట్ ప్రకారం చూసుకుంటే మొత్తం ఐదు సినిమాలకు పని చేసారు. విడిగా తీసిన శివ, అంతం హింది రీమేక్ లకు కూడా వర్మనే దర్శకత్వం వహించాడు. సో ఈ కాంబోలో రాబోతున్న ఆరో మూవీ ఈ ఆఫీసర్.

Full View
Tags:    

Similar News