భక్త నాగార్జున ఆడియో డేట్ చెప్పేశాడు

Update: 2017-01-01 17:00 GMT
అక్కినేని నాగార్జున.. కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓం నమో వెంకేటేశాయ. వెంకటేశ్వరుని పరమ భక్తుడైన హథీరాం బాబాగా నాగార్జున నటిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది. ఇప్పుడు పబ్లిసిటీ యాక్టివిటీస్ కూడా ప్రారంభించిన టీం.. ఆడియో రిలీజ్ డేట్ ను నాగార్జునతోనే అనౌన్స్ చేయించడం విశేషం.

'అందరికీ హాయ్.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఓం నమో వెంకటేశాయ ఆడియో రిలీజ్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నా. 2017 జనవరి 8న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కానుంది. ఒరిజినల్ ఆడియో వినాలని భావించేవారు.. లహరి మ్యూజిక్ సబ్ స్క్రయిబ్ అవండి' అంటూ చెప్పాడు నాగార్జున. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయి.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో.. ఓం నమో వెంకటేశాయకు శాంపిల్ చూపించేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. భక్తిరస చిత్రమైనా.. తన స్టైల్ లో నవరసాలు మిక్స్ చేశారనే విషయాన్ని కూడా టీజర్లోనే చూపించేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే జొప్పించారు. ఫిబ్రవరి 10న మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది ఓం నమో వెంకటేశాయ యూనిట్.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News