సీనియర్ హీరోల్లో చాలామంది ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక తికమక పడిపోతుంటారు. యువ కథానాయకుల్ని దృష్టిలో ఉంచుకొనే కథలు సిద్ధమవుతుంటాయి కాబట్టి తామేం చేయాలో అర్థం కాక డైలమాలో పడిపోతుంటారు సీనియర్లు. కానీ నాగార్జునకి మాత్రం ఆ కన్ ఫ్యూజన్ అస్సల్లేదు. ఎలాంటి కథలోనైనా ఇమిడిపోయేలా తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. అందుకే కాస్త కాన్సంట్రేట్ చేస్తే చాలు... ఈజీగా కథలు దొరికేస్తుంటాయి. అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాల్ని కూడా పట్టాలెక్కిస్తుంటాడు నాగ్. అయితే ఇప్పుడు ఆయన ఆలోచనంతా తన వారసుల గురించే. వాళ్ల కెరీర్‌ని గాడిలో పెట్టడమే తనముందున్న అతి పెద్ద బాధ్యత అంటున్నాడు నాగ్. వాళ్లకి ఎలాగైనా హిట్టు అందించాల్సిన బాధ్యత నాపై ఉందని నాగ్ చెబుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే ఇక తనయుల సినిమాల గురించే ఆలోచించాల్సి వుందని చెప్పుకొచ్చాడు.
నాగచైతన్య మధ్యలో కొన్ని సక్సెస్ లు అందుకొన్నాడు. అయితే కొంతకాలంగా ఆయనకీ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి. అఖిల్ కి కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. అందుకే ఇప్పుడు తనకంటే తన వారసుల కెరీరే ముఖ్యమన్న అభిప్రాయంతో నాగ్ ఉన్నాడు. ``నాకూ తొలినాళ్లలో పరాజయాలే ఎదురయ్యాయి. ఆటుపోట్ల తర్వాతే నా కెరీర్ గాడిలో పడింది. మా అబ్బాయిలు కూడా అలాగే నేర్చుకుంటారు. అయితే నావంతు బాధ్యత కూడా ఉంది కాబట్టి... వాళ్లిద్దరికీ హిట్టు ఇవ్వాలనే ఆలోచనతో కథలు వింటున్నా`` అని ఇటీవల మీడియాతో చెప్పుకొచ్చాడు నాగ్.