సోగ్గాడు మళ్లీ కదిలాడు!

Update: 2015-06-30 05:00 GMT
నాగార్జున మరోసారి ఓ కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ 'సోగ్గాడే చిన్నినాయనా' అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో నాగ్‌  ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలు. కళ్యాణ్‌   అనే  కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడమే ఆలస్యం... వెంటనే సినిమాని పట్టాలెక్కించాడు నాగ్‌. కొన్నాళ్లపాటు వేగంగా చిత్రీకరణ చేశారు. ఆ జోరు చూశాక సినిమాని తొందరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనిపించింది. అయితే ఏమైందో ఏంటో కానీ... మధ్యలో సినిమాకి బ్రేక్‌ పడింది. తీసిన సన్నివేశాలు నాగార్జునకి నచ్చకపోవడంతోనే సినిమాకి బ్రేక్‌ పడిందని ప్రచారం సాగింది.  అయితే స్క్రిప్టులో కొన్ని చిన్న మార్పులతో పాటు తీసిన కొన్ని సన్నివేశాల్ని మళ్లీ తీయాలని డిసైడ్‌ అయ్యారట. అందుకోసం సాయిమాధవ్‌ అనే ఓ కొత్త రచయితని కూడా రంగంలోకి తీసుకొచ్చారు. ఆ మార్పు చేర్పులన్నీ పూర్తయ్యాయి కాబట్టి మళ్లీ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం బెంగుళూరులో చిత్రీకరణ జరుగుతోంది. సగానికిపైగా పూర్తయిన ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు నాగ్‌.  ఈ సినిమా పనులు ఓ కొలిక్కి వచ్చాకే కార్తీతోకలిసి చేస్తున్న మల్టీస్టారర్‌   చిత్రం గురించి ఆలోచించాలని నాగ్‌ భావిస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News