నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి.. సక్సెస్ పుల్ టాక్ తో దూసుకుపోతోంది. ఊహించినట్లుగానే మల్టీప్లెక్స్, ఏ క్లాస్ సెంటర్లలో తిరుగులేని టాక్ సొంతం చేసుకుంది. బీ, సీ సెంటర్లలో కూడా ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో అయితే.. బ్లాక్ బస్టర్ కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది ఊపిరి.
గురువారం ప్రివ్యూ షోలతో 76,635 డాలర్లు రాగా, శుక్రవారం రోజున 210,233 డాలర్లు వసూలయ్యాయి. ఇక శనివారమైతే అత్యధికంగా 3,59,405 డాలర్ల కలెక్షన్స్ రావడం విశేషం. మొత్తం కలిపి తొలి మూడు రోజుల్లో 6,46,273 డాలర్లను రాబట్టగలిగింది ఊపిరి. మూడ్రోజుల వసూళ్ల మొత్తాన్ని మన కరెన్సీలో అయి 4.32 కోట్లుగా చెప్పచ్చు. సెకండ్ వీకెండ్ నాటికి మిలియన్ డాలర్స్ మూవీగా అతరిస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు కలెక్షన్స్ పెరుగుతున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆదివారం ఈ అన్ని మొత్తాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టగలిగిందని అంటున్నారు.
ఈ స్థాయిలో వసూళ్లలో పెరుగుదల బాలీవుడ్ భారీ చిత్రాలకు కూడా సాధ్యం కాదనే విషయం స్పష్టమే. మరోవైపు శనివారం వరకూ వచ్చిన కలెక్షన్స్ తోనే యూఎస్ బాక్సాఫీస్ లో 11 వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం.. త్వరలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.