రీమేక్‌ ల కోసం తిర‌గ‌నంటున్న నాగ్‌

Update: 2015-08-29 17:37 GMT
తెలుగు ప‌రిశ్ర‌మ‌లో యువ క‌థానాయ‌కులకు క‌థ‌ల కొర‌త ఉండ‌దు. సీనియ‌ర్ హీరోలు మాత్రం వాళ్ల వ‌య‌సుకు త‌గ్గ క‌థ‌ల కోసం బాగా వెద‌కాల్సి వుంటుంది. అందుకే కొద్దిమంది క‌థానాయ‌కులు రీమేక్‌ ల‌పై దృష్టిపెడుతుంటారు. వెంక‌టేష్‌ లాంటి హీరో అయితే త‌ర‌చూగా త‌మిళం, మ‌ల‌యాళం ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే సినిమాల్ని రీమేక్ చేస్తుంటారు. వాటితోనే విజ‌యాలు అందుకొంటుంటారు. ఆయ‌న్ని రీమేక్ సినిమాల హీరో అని కూడా పిలుస్తుంటారు. నాగార్జున‌కి కూడా రీమేక్‌ ల విష‌యంలో మంచి రికార్డే ఉంది. రికార్డంటే ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు కాదు. `నువ్వొస్తావ‌ని`, `నిన్నే ప్రేమిస్తా`లాంటి చిత్రాలు చేసి ఆయ‌న మంచి విజ‌యాలు అందుకొన్నారు. అయితే అలాంటి గొప్ప చిత్రాలొచ్చినా ఆ త‌ర్వాత మాత్రం ఎక్కువ‌గా రీమేక్ సినిమాలు చేయ‌లేదు నాగ్‌. అందుకు కార‌ణ‌మేమిటి? అని అడిగితే ఆయ‌న ఓపెన్‌ గా మాట్లాడేశారు.

అంద‌రిలా రీమేక్ సినిమాల కోస‌మ‌ని చెన్నై, కేర‌ళ చుట్టూ తిర‌గ‌డం నాకు న‌చ్చ‌దు, ఏదైనా  నా ద‌గ్గ‌రికి వ‌స్తేనే చేస్తా అని చెప్పుకొచ్చాడు నాగార్జున‌.  ``రీమేక్ సినిమాలు చేస్తే రిస్క్  త‌క్కువ‌ని చాలా మంది క‌థానాయ‌కులు అటువైపు చూస్తుంటారు. అప్ప‌టికే ఫైన‌ల్ రిజ‌ల్ట్‌ ని చూసుంటారు కాబ‌ట్టి. అయితే నేను మాత్రం రిస్క్ అంటూ భ‌య‌ప‌డిపోను. ఏదైనా మ‌న‌సుకు న‌చ్చిన క‌థ దొరికితే వెంట‌నే చేసేస్తా`` అని ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్పుకొచ్చాడు నాగార్జున‌. ఇప్పుడాయ‌న `ఇన్‌ ట‌చ‌బుల్స్‌` అనే ఓ ఫ్రెంచ్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమాలోని దాదాపు స‌న్నివేశాల్లో నాగార్జున స్ట్రెచ‌ర్‌ పైనే కూర్చుని కనిపిస్తుంటాడ‌ట‌. ఈ సినిమాకి `ఊపిరి` అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News