అక్కినేని నాగార్జున.. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'మన్మథుడు 2' ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా మొదటి రోజు కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి కానీ ప్రేక్షకుల్లో మిక్స్డ్ టాక్ ఉంది. 'మన్మథుడు 2' లో త్రివిక్రమ్ లేని లోటు కనిపిస్తోందని చాలామంది ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇదే విషయం ఒక ఇంటర్వ్యూ లో నాగార్జునను అడిగితే అదేమీ లేదన్నట్టు జవాబిచ్చారు .
"మన్మథుడు డైలాగ్స్ త్రివిక్రమ్ గారు రాశారు.. మీరేమైనా ఈ సినిమాలో త్రివిక్రమ్ గారిని మిస్ అయ్యారా.. త్రివిక్రమ్ ఉంటే బాగుండేదని అనుకున్నారా?" అని అడిగితే "17 ఏళ్ళ క్రితం అది పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ సినిమాకు రాహుల్ - కిట్టు రాసింది కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ప్రెజెంట్ జెనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు ఉంది. రాహుల్ వర్క్ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు.
'మన్మథుడు 2' సినిమా ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకురాకుండా కంటిన్యూ అవుతున్న కింగ్ నాగ్ ఈసారి కూడా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించలేదు. పదిహేడేళ్ళ క్రితం ప్రేక్షకులకు త్రివిక్రమ్ కరెక్ట్ అని.. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి రాహుల్ - కిట్టు రాసిన డైలాగ్స్ కరెక్ట్ అని చెప్పడం చూస్తుంటే త్రివిక్రమ్ అవుట్ డేటెడ్ అయ్యాడనే అభిప్రాయంలో నాగ్ ఉన్నారని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆ అభిప్రాయంలో ఉంటే తప్పేమీ లేదని.. 'మన్మథుడు' సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూ ఉంటాయని.. అదే 'మన్మథుడు 2' నుంచి ఒక డైలాగ్ చెప్పమంటే "ఐ వోన్లీ మేక్ లవ్' అనే డైలాగ్ తప్ప మరొకటి వినిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
రాహుల్ గురించి మాట్లాడుతూ నాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. "రాహుల్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుటి ఆడియన్స్ కు తగ్గట్టు సెన్సిబిలిటీస్ ఉన్నాయి. నటీనటుల దగ్గర నుంచి నటన రాబట్టుకోవడం రాహుల్ కు తెలుసు.. అతని రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. రాహుల్.. కిట్టు విస్సాప్రగడ కలిసి డైలాగ్స్ రాయడం జరిగింది.. అవి హిలేరియస్ డైలాగ్స్" అన్నాడు.