నాగ్ కూడా ఒకే అన్నాడా ఏంటి?

Update: 2017-12-29 08:24 GMT
ప్రస్తుత రోజుల్లో వెబ్ సిరీస్ లు ఏ విధంగా హల్ చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అలా ఈ కల్చర్ షిఫ్ట్ అయ్యిందో లేదో సౌత్ కి కూడా పాకేసింది. కొత్తగా ట్రై చేయడంలో తప్పేముంది అని తారలు ఏ మాత్రం ఆలోచించకుండా మంచి కాన్సప్ట్స్ తో వెబ్ సిరీస్ లకు ఒకే చెబుతున్నారు. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన నటీనటులు ఎక్కువగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.

కానీ ప్రస్తుతం ఆ తరహాలో ఎవ్వరు ఆలోచించడం లేదు. నటులన్నాకా అన్ని ప్రయత్నాలు చేయాలనీ వెబ్ సిరీస్ లలో కూడా ఓ అడుగు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొన్నటి వరకు నవదీప్ - తేజస్విని వంటి ఓ మీడియమ్ ఇమేజ్ ఉన్న తారలు వెబ్ సిరీస్ లతో బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరికొన్ని చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇక రానా లాంటి స్టార్ హీరో కూడా తనదైన శైలిలో వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నాడు. త్వరలో వెంకటేష్ కూడా ఆ తరహాలో కనిపిస్తాడు అని వార్తలు వస్తున్నాయి.

ఇక వీరితో పాటు నవ మన్మధుడు అక్కినేని నాగార్జున కూడా వెబ్ సిరీస్ తో సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మంచు లక్ష్మి అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరొక స్పెషల్ ఏమిటంటే ఆ వెబ్ సిరీస్ ను అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడట. ప్రయోగాలను చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందు ఉంటాడు. అంతే కాకుండా టాలెంట్ ఉంటే తన వరకు చాలా ఎంకరేజ్ చేస్తాడు. అదే విధంగా ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ను కూడా నాగ్ ఒకే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ నాగ్ ఒప్పుకోకుంటే సుమంత్ తో కానిచ్చేస్తారని సమాచారం. 
Tags:    

Similar News