ఫాదర్స్ డే స్పెషల్ గా యంగ్ ఏఎన్నార్

Update: 2016-06-19 07:24 GMT
ఫాదర్స్ డే సందర్భంగా.. స్టార్లు - సెలబ్రిటీలు రకరకాల ట్వీట్లు పెడుతున్నారు. తమ ఫాదర్ కి విషెస్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. అన్నింటిలోకి టాలీవుడ్ మన్మథుడు నాగ్ చేసిన ఒక పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అక్కినేని ని గుర్తు చేయడంతో పాటు.. తన చిన్నతనాన్ని కూడా చూపించి.. అందరినీ నవ్వించేశాడు నాగార్జున.

ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో.. ఆ ఫోటోనే మరో ఫోటో తీసి పోస్ట్ చేశాడు నాగ్. అందులో మోకాళ్లపై కూచున్న ఏఎన్నార్ కనిపిస్తారు. ఎదురుగా ఉన్న తన ఇద్దరు పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతున్న నాగేశ్వర్రావు ఫోటో అది. ఆ పిల్లలెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ పిల్లాడే ఇప్పటి మన నాగార్జున. ఆ అమ్మాయి నాగ్ సోదరి నాగసుశీల. ఇద్దరి వయసు ఐదారేళ్ల కూడా ఉండదు.

అంటే కనీసం ఓ యాభై ఏళ్ల క్రితం తీసిన ఫోటో ఇది. ఇంత భద్రంగా దాన్ని ఉంచి.. మళ్లీ ఇప్పుడు ఫాదర్స్ డే రోజున చూపించడంతో.. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. యంగ్ ఏజ్ లో నాగేశ్వర్రావుని చూసే అవకాశం రావడంతో.. ఫ్యాన్స్ కి భలే ముచ్చటగా అనిపించింది. మొత్తానికి ఫాదర్స్ డే నాడు.. నాగ్ ఇచ్చి ట్రిబ్యూట్ సూపర్ అంతే.
Tags:    

Similar News