నాగార్జున 'మన్మధుడు 2' చిత్రం చేస్తున్న సమయంలోనే బంగార్రాజు చిత్రం చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కాని ఏదో కారణం వల్ల ఆ సినిమాను నాగార్జున మరోసారి వాయిదా వేశాడు. కాస్త గ్యాప్ తీసుకున్న నాగార్జున ఇప్పుడు ఒక పోలీస్ స్టోరీని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. కాని ఈసారి చాలా ప్రత్యేకమైన పోలీస్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
పోలీస్ ఆపరేషన్ నేపథ్యం లో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అందులో భాగంగా హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్ మరియు టెక్నీషియన్స్ ను పిలిపించి వారితో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 50 మందికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈమద్య కాలంలో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఉపయోగించడం చాలా కామన్ అయ్యింది. సాహో.. సైరా చిత్రాలకు వారు చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు నాగార్జున చేయబోతున్న భారీ పోలీస్ అడ్వెంచర్ చిత్రం కోసం కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించబోతుంది. సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెళ్లడవ్వనున్నాయి.