కింగ్ ప్రకటనతో ఫుల్ ఖుషీలో అక్కినేని ఫ్యాన్స్..!

Update: 2021-04-26 09:03 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున 60 ఏళ్ళ వయసులో కూడా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ వస్తున్నారు. అదే సమయంలో తన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య - అఖిల్ ల కెరీర్ ని గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. ఇప్పటికే చైతన్య తో కలిసి 'మనం' వంటి మరపురాని సినిమా చేసిన నాగ్.. ఇప్పుడు 'బంగార్రాజు' చిత్రాన్ని చేయనున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి ప్రీక్వెల్ గా ఇది రూపొందనుంది. అయితే ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ తో కూడా ఓ సినిమా చేయడానికి నాగార్జున ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

'వైల్డ్ డాగ్' మూవీ నెట్‌ ఫ్లిక్స్‌ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఖిల్‌ తో చేయబోయే మల్టీస్టారర్ గురించి ప్రకటించారు. ''అఖిల్‌ తో మల్టీస్టారర్ చేస్తున్నాను. కోవిడ్ పరిస్థితుల వల్ల దాన్ని ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా చెబుతాం'' అని నాగ్ అన్నారు. అలానే 'బంగార్రాజు' స్క్రిప్ట్ వర్క్ కూడా చూసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నాగ్ - అఖిల్ కలిసి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించనున్నట్లు ప్రకటించడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే నాగార్జున ప్రస్తుతం ‘పీఎస్వీ గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది.

మరోవైపు అఖిల్ అక్కినేని నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం కోవిడ్ పరిస్థితులు మెరుగైన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ప్రస్తుతం  'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. నాగ్ - అఖిల్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత వీరి కాంబోలో మల్టీస్టారర్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News