‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ జనాలకు నచ్చిన చాలా విషయాలున్నాయి. అన్నింట్లోకి బాగా ఆకట్టుకున్నది మాత్రం ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన నైనానే. నీ పేరేంటి అని అడిగితే.. ‘చిన్నారి పెళ్లికూతురు’ అని.. బొమ్మతో ఆటలేంటి అంటే.. ‘అది బొమ్మ కాదు.. జెస్సీ’ అని ముచ్చటగొలిపేలా ఆ చిన్న పిల్ల చెప్పిన డైలాగ్స్ కానీ.. తన క్యూట్ ఫేస్ కానీ.. జనాలకు భలే నచ్చేశాయి. ఈ పాప పుట్టింది, పెరుగుతోంది అమెరికాలోనే. ఐతే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కోసమే తనని ఇండియాకు తీసుకొచ్చారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కానిచ్చి.. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లలో కూడా ఈ పాపను చక్కగా ఉపయోగించుకుని.. సినిమా రిలీజ్ తర్వాత ఫ్లైటెక్కించేశారు.
ఐతే అమెరికాకు వెళ్లాక కూడా ఆ పాప.. నానిని మరిచిపోలేదు. మొన్న నాని పుట్టిన రోజు సందర్భంగా తన కోసం ఒక వాయిస్ మెసేజ్ ద్వారా అతడికి విష్ చెప్పింది. నాని ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. నైనా పంపిన మెసేజ్ తాలూకు యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు. తనేం చెప్పింది విని తీరాల్సిందే అన్నాడు. నాని ఎందుకంత పర్టికులర్ గా చెప్పాడో.. ఆ పాప వాయిస్ విన్నాకే అర్థమవుతుంది. నాని అన్నా హ్యాపీ బర్డ్ డే.. నీకు ఏం గిఫ్ట్ కావాలి.. సైకిల్ కావాలా.. ఏరోప్లేన్ కావాలా.. హెలికాఫ్టర్ కావాలా.. నీకు ఏరోప్లేన్ కావాలా.. నీకు ఏరోప్లేన్ కావాలా.. కానీ నేను నీకు ఏరోప్లేన్ ఇవ్వను.. హెలికాఫ్టర్ ఇస్తా.. ప్రామిస్.. అంటూ ముద్దు ముద్దుగా ఆ చిన్నారి చెప్పిన మాటలు వింటే ఎవ్వరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. కావాలంటే మీరూ ఓసారి ఆ వాయిస్ వినండి.
Full View