బాలీవుడ్ లో వేల కోట్ల ఆస్తులున్న వాళ్లున్నారు. ఒక్కో సినిమాకు వందల కోట్లు సంపాదించేవాళ్లున్నారు. కానీ వాళ్లెవరికీ మహారాష్ట్రలో రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మనసు కరగలేదు. ఆ సంగతి పట్టింపే లేదు. సినిమా వాళ్లే కాదు, మిగతా వాళ్లదీ అదే పరిస్థితి. ప్రభుత్వాలకే లెక్కలేనపుడు తమకేంటి అన్నట్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కానీ నానా పటేకర్ మాత్రం అందరిలా చూస్తూ ఊరుకోలేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తన వంతు సాయం అందించాడు. వందకు పైగా కుటుంబాల్ని ఆదుకున్నాడు. రైతులు ఇంకెవరికైనా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తే తన దగ్గరికి రండి.. ఆదుకుంటా అని స్టేట్ మెంట్ ఇవ్వడం ఆయనకే చెల్లింది. ఐతే నానా ఇదేదో పబ్లిసిటీ కోసం చేస్తున్న పనేమీ కాదు. ముందు నుంచి ఆయన చాలా కమిటెడ్.
వందల సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించినా నానా పాతికేళ్లు చిన్న సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్న సంగతి చాలామందికి తెలియదు. అప్పట్లో సినీ కళాకారుల కోసం కట్టించి ఇచ్చిన ఇంట్లోనే ఆయనుంటున్నాడు. పారితోషకంగా తీసుకునే డబ్బులో చాలా వరకు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తుంటాడాయన. ఎప్పుడూ లగ్జరీ కార్లను వాడింది లేదు. ఇప్పటికీ షూటింగ్ అంటే ఆటోలోనే వెళ్తారు. 30 ఏళ్లుగా ఆయనకిదే అలవాటు. సంజయ్ దత్ నేరస్థుడని కోర్టు ఖరారు చేసి.. జైలు శిక్ష విధించాక.. ఆయన పక్కన నేనెప్పటికీ నటించను అని ప్రకటించిన విలువలున్న మనిషి నానా.
శివసేన వ్యవస్థపాకుడైన దివంగత నేత బాల్ థాకరేకు నానా మిత్రుడు. కానీ ముంబై పేలుళ్ల సమయంలో హింసకు కారణమవుతున్నాడంటూ ఆయన తీరును వ్యతిరేకించాడు. ముంబైలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్న ఆ సమయంలో రోడ్డు మీదికి వచ్చి ఆందోళనల్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు నానా. చాలా పార్టీలు ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని.. తమ పార్టీ నుంచి పోటీ చేయాలని అడిగినా ఒప్పుకోలేదు. నానా దర్శకుడిగా మారి.. తీసిన తొలి సినిమా ‘ప్రహార్’ కోసం మూడేళ్లు మిలటరీ శిక్షణ తీసుకున్నాడు నానా. అతడి అంకిత భావాన్ని గుర్తించి ఆర్మీ కెప్టెన్ హోదా ఇచ్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో స్వచ్ఛందంగా సేవ చేశాడు నానా. ఇదీ ఆయన చరిత్ర.
రైతుల కోసం చాలా ఏళ్ల నుంచే గళం వినిపిస్తున్నాడు. తన వంతు సాయం చేస్తున్నాడు నానా. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండటానికే మీడియా ముందుకొచ్చి స్టేట్ మెంట్ ఇచ్చాడు నానా. ఇప్పటికి 100కు పైగా కుటుంబాలకు సాయం చేసిన నానా.. ఇంకో 800 కుటుంబాలకు సాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. తన దగ్గరున్న డబ్బంతా అయిపోయే వరకు అలా ఇవ్వడానికి సిద్ధమంటున్నాడాయన. నానా గొప్ప నటుడన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఎంత గొప్ప వాడన్నది కూడా ఇప్పుడిప్పుడే జనాలకు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లకు పాదాభివందనం చేయాల్సిందే!!!