నందమూరి వారసురాలు కూడా నిర్మాతగా మారనుందా..?

Update: 2022-10-15 23:30 GMT
గత ఏడాది కాలంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌ లో భారీ మార్పు వచ్చిందని చెప్పాలి. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని బాలయ్య.. పాండమిక్ టైంలో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ అందుకుని ట్రాక్ లోకి వచ్చారు. మరోవైపు ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టిన తర్వాత అతని చుట్టూ సానుకూల బజ్ ఏర్పడింది.

'అన్ స్టాపబుల్' టాక్ షో కోసం తొలిసారిగా హోస్ట్ గా మారిన బాలయ్య.. ఎంట్రీతోనే అదరగొట్టాడు. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ ఆహా ఓటీటీలో వచ్చిన ఈ కార్యక్రమం.. నటసింహం మీద అందరి థింకింగ్ ని మార్చేసింది. బాలకృష్ణ లోని మరో కోణాన్ని పరిచయం చేసింది. అయితే దీనంతటి వెనుక బాలకృష్ణ కూతురు హస్తం ఉందనే సంగతి కొందరికి మాత్రమే తెలుసు.

బాలయ్య చిన్న కూతురు తేజస్విని 'అన్‌ స్టాపబుల్ విత్ NBK' షోకి క్రియేటివ్ కన్సల్టెంట్‌ గా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ డేట్స్ మరియు ఇతర వర్క్స్ కు సంబంధించిన కార్యకలాపాలను ఆమె వ్యక్తిగతంగా చూసుకుంటుంది. 'ఆహా' టీమ్‌ తో కలిసి తన తండ్రి లుక్ మరియు కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందని టాక్. అయితే ఇప్పుడు తేజస్విని నిర్మాతగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తేజస్విని తన తండ్రి బాలయ్య తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ కి దర్శకుడిని కూడా ఖరారు చేస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కమిట్ మెంట్స్ పూర్తైన తర్వాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

టాలీవుడ్ లో ప్రధానంగా ఉండే ఫ్యామిలీల నుంచి ఇప్పటికే వారసులు ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే వారసురాళ్లు రావడం మాత్రం చాలా అరుదు. అక్కినేని ఫ్యామిలీలో సుప్రియ హీరోయిన్ గా వచ్చి, ఆ తర్వాత నిర్మాతగా రాణిస్తోంది. మెగా కుటుంబంలో నిహారిక కొణిదెల సైతం హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారింది.

అలానే సుష్మిత కొణిదెల కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మంజుల నటిగా నిర్మాతగా డైరెక్టర్ గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి బాలయ్య డాటర్ తేజస్విని కూడా ప్రొడ్యూసర్ గా మారనుందని వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ఇప్పటికే బిజినెస్ రంగంలో రాణిస్తోంది. 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షోతో తేజస్విని కూడా సైలెంట్ గా ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో నిర్మాతగా మారనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News