తన డైరెక్టర్ని పిచ్చోడు అనేశాడు హీరో నాని. ఐతే అది సినిమా పిచ్చేనంటలెండి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ డైరెక్టర్
హను రాఘవపూడి గురించి నాని చేసిన వ్యాఖ్య ఇది. హను తీసిన ‘అందాల రాక్షసి’తో పోలిస్తే ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ పూర్తి భిన్నంగా ఉంటుందని నాని చెప్పాడు.
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ ఆడియో ఫంక్షన్ లో నాని మాట్లాడుతూ.. ‘‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ నా కెరీర్లో చాలా స్పెషల్. హను రాఘవపూడి ‘అందాల రాక్షసి’ లాంటి సినిమా తీశాక నాకు కథ చెబుతానంటే ‘నాన్నా నాకు పెళ్లి చేయ్’ అని అరిచే టైపు స్టోరీ చెబుతాడనుకున్నా. కానీ అతనేమో పూర్తి భిన్నమైన స్టోరీ చెప్పాడు. ‘అందాల రాక్షసి’ చూసిన వాళ్లు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చూస్తే షాకవుతారు. అంత భిన్నంగా ఉంటుందీ సినిమా. హను ఒక సినిమా పిచ్చోడు. షూటింగులో దెబ్బలు తగిలించుకునేవాడు. రక్తాలు కారుతుండేవి. అంతగా కష్టపడేవాడు’’ అని చెప్పాడు.
14 రీల్స్ సంస్థలో సినిమా చేయడం తన అదృష్టమని.. నిర్మాతలు ముగ్గురూ అసిస్టెంట్ డైరెక్టర్ల లాగా కష్టపడ్డారని.. ఇంత మంచి ప్రాజెక్టులో తనకు భాగం కల్పించినందుకు ధన్యుడనని అన్నాడు నాని. మహేష్ తన సినిమా ఆడియో ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉందని.. ఆయనకు థ్యాంక్స్ అని తన ప్రసంగాన్ని ముగించాడు నాని.