నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోగా నాని ఫస్ట్ ఛాయిస్ కాదనే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ 'శ్యామ్ సింగ రాయ్' లో హీరోగా రానా దగ్గుబాటి ని అనుకున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ ను ముందుగా రానా కు వినిపించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఈ స్టోరీ నాని కి బాగా సూటు అవుతుందని రానా అభిప్రాయపడ్డారట. రానా సూచన ప్రకారం నానిని రాహుల్ సంప్రదించగా.. వెంటనే రెండో ఆలోచన లేకుండా ఓకే చేశారని అంటున్నారు.
దర్శక రచయితలు కొన్నిసార్లు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తే.. వేరే హీరోలతో సినిమాగా తెర మీదకు వస్తుంటాయి. ఇలా చాలా మంది హీరోలు ఇతర హీరోల కథలతో సూపర్ హిట్స్ అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
కాగా' 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంలో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం కలకత్తాలో చిత్రీకరించారు. అలానే హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.