నటసింహం నందమూరి బాలకృష్ణ ''అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'' అనే స్పెషల్ టాక్ షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. వెండితెర మీద తనదైన శైలి డైలాగ్స్ తో అలరించిన బాలయ్య.. ఈ షో లో మంచి టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు గెస్టుగా స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ విశేష స్పందన తెచ్చుకుంది.
ఇందులో మంచు విష్ణు - మంచు లక్ష్మి కూడా హాజరై సందడి చేశారు. రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు. 'సెల్ఫ్ మేడ్ కి సర్ నేమ్' అంటూ నానిని ఉద్దేశించి బాలకృష్ణ చెప్పిన మాటలతో వచ్చిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం రాత్రి ఫుల్ ఎపిసోడ్ ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయింది.
బాలకృష్ణ - నాని కలయికలో రూపొందిన 'అన్ స్టాపబుల్' రెండో ఎపిసోడ్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. ఎప్పుడూ సీరియస్ గా, షార్ట్ టెంపర్ గా పేరున్న బాలకృష్ణ.. ఈ షోలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. నాని తో ఉల్లాసంగా మాట్లాడుతూ.. తనపై తాను జోక్స్ వేసుకోడానికి.. తన బ్రాండ్ మాన్షన్ హౌస్ గురించి చెప్పడానికి కూడా బాలయ్య వెనకాడలేదు.
పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో రైలు ఎపిసోడ్ గురించి చెప్పి నవ్వించారు. ఈ సందర్భంగా బాలయ్య కు నాని ఓ సర్ప్రైజింగ్ వీడియో చూపించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఓ పాప ప్రాణాపాయం నుంచి బయటపడిందంటూ.. బాలకృష్ణ లేకపోతే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవి కాదని ఆయన చేసిన సాయం గురించి పాప తల్లి చెప్పడం అందరినీ కదిలించింది.
క్యాన్సర్ ను జయించిన ఆ పాపను బాలయ్య వద్దకు నాని తీసుకొచ్చారు. ఆ చిన్నారిని బాలకృష్ణ ఆప్యాయంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం అందరికీ ఆనందబాష్పాలు వచ్చేలా చేసింది. బాలయ్య లోని మరో కోణాన్ని చూపిస్తున్న ఈ షో విశేష స్పందన తెచ్చుకుంటోంది.
లేటెస్ట్ ఎపిసోడ్ లో ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అనే డైలాగ్ తో నాని.. ‘అందరికీ పెట్టి నాకు పెట్టలేదంటే’ అనే సంభాషణతో బాలకృష్ణ అలరించారు. ఇద్దరూ కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. బాలయ్య - నాని ఇద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ లో 12 ఎపిసోడ్స్ ఉండగా.. తదుపరి ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ గెస్టుగా హాజరవుతారని టాక్ వినిపిస్తోంది.