జెర్సీ నానికి చాలా స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. గత ఏడాది రెండు పరాజయాలు చూసిన నేపధ్యంలో ఇది పెద్ద రిలీఫ్ గా నిలిచింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నాని కెరీర్ బెస్ట్ వసూళ్లు మాత్రం నమోదు కాలేదు. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు ఇప్పుడు జెర్సీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్ళకపోవడానికి రీజన్స్ ని లిస్టు చేయలెం కాని నాని ఫోకస్ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ మీదే ఉంది.
విభిన్నమైన స్క్రీన్ ప్లే ఊహాతీతంగా సినిమాలు తీస్తాడని పేరున్న విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ క్రమం తప్పకుండ జరుగుతూ ఉంది. టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత తొలుత వ్యక్తమైనప్పటికి తర్వాత సద్దుమణిగి పోయింది. ఆ టైటిల్ తమదంటూ చెప్పిన వేరే టీం కూడా చప్పుడు చేయడం లేదు
తాజాగా వచ్చిన అప్ డేట్ ఏమిటంటే ఇందులో నాని గ్యాంగ్ లీడర్ గా కనిపించేది దొంగల బ్యాచుకట. ఐదుగురు రకరకాల వయసు ఉన్న అమ్మాయిలు మహిళలతో నాని పాత్ర దొంగతనాలు చేస్తూ ఉంటుందట. అసలు వీళ్ళందరూ ఇలా ఎందుకు కలిశారు నాని ఎందుకు లేడీస్ నే గ్యాంగ్ లో పెట్టుకున్నాడు ఇవన్ని విక్రం కుమార్ స్టైల్ లో కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీపై న్యాచురల్ స్టార్ ఫాన్స్ కు చాలా అంచనాలు ఉన్నాయి. జెర్సీకి ఎంత పేరు వచ్చినా నాని స్టామినాని పూర్తిగా వాడుకోలేకపోయింది. ఆ కొరత గ్యాంగ్ లీడర్ తోనే తీరాలని వాళ్ళ కోరిక.