షార్ట్ ఫిల్మ్స్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని భలే మంచి రోజు తో డైరెక్టర్ గా మారిన శ్రీరామ్ ఆదిత్య ఇప్పుడు నలుగురు హీరోల్ని పెట్టి శమంతకమణి తీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటించిన నలుగురు హీరోలకి కెరీర్ లో సరైన హిట లేదు, అడపదడప ఉన్నా ఆ సక్సెస్ వేరే వాళ్ల ఎకౌంట్ లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంతోనే నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆదిలను ఎంపిక చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య సక్సెస్ ఫుల్ గా సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ట్రైలర్స్, టీజర్స్ చూస్తుంటే నలుగురు హీరోల్ని శ్రీరామ్ బాగానే హ్యాండిల్ చేసినట్లుగా అనిపిస్తోంది.
అయితే జూలై 14న ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ఇటీవలే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది ఈ చిత్ర బృందం. ఓ వారం క్రితం గ్రాండ్ గా ఎరేంజ్ చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తప్ప మళ్లీ ఇంతవరకు ఈ హీరోలు జాడ కనిపించలేదు. కానీ భలే మంచి రోజు సినిమాలో హీరోగా యాక్ట్ చేసి శ్రీరామ్ కు లిఫ్ట్ ఇచ్చిన సుధీర్ బాబు మాత్రం శమంతకమణి విషయంలో మీడియాకి దగ్గరగా ఉంటున్నాడు. అనుకున్నంత రేంజ్ లో తనకు క్రేజ్ లేదని, తనకు ప్రచారం అవసరం అని సుధీర్ గ్రహించినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మిగతా ముగ్గురు హీరోలు తమ రేంజ్ చాలా పెద్దదనే భ్రమల్లో ఉంటూ శమంతకమణిని లైట్ తీసుకున్నట్లుగా తెలిసింది. మరోవైపున పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ షెడ్యూల్ లో కార్లిటీ లేకపోవడంతో ఆ ముగ్గురు హీరోలు శమంతకమణికి దూరంగా ఉన్నట్లు సమాచారం. మరి రిలీజ్ లోపుశమంతకమణికి ప్రచారం చేసేందుకు ఆ ముగ్గురు రెడీ అవుతారేమో చూడాలి.