ఎంత చిన్న హీరో అయినా - పెద్ద హీరో అయినా ఏడాదికి రెండు సినిమాలు మరీ వేగంగా తీస్తే మూడు సినిమాలు అంటే అది చాలా అరుదు అనే అనుకోవాలి. అలాంటిది ఈ ఏడాదిలో అప్పుడే ఆరో సినిమా విడుదల చేయడానికి రెడీ అయిపోయాడు నారా రోహిత్. డిఫరెంట్ సబ్జెక్టులతో కథలను ఎంచుకోవడం, వీలైనంత వేగంగా సినిమాలు పూర్తి చేయడం ప్రత్యేకతగా పెట్టుకున్న రోహిత్... అదే ఆలోచనలతో ముందుకెళ్తున్నటున్నాడు!
ఈ ఏడాదిలో.. ఇప్పటికే తుంటరి - సావిత్రి - రాజా చెయ్యి వేస్తే - జ్యో అచ్యుతానంద - శంకర సినిమాలతో పలకరించి అలరించిన నారా రోహిత్ - తాజాగా "అప్పట్లో ఒకడుండేవాడు" తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి రోహిత్ హీరో మాత్రమే కాదు.. నిర్మాణ భాగస్వామి కూడా. ఈ సినిమాని "అసుర" దర్శకుడు కృష్ణ విజయ్, ప్రశాంతిలతో కలిసి నిర్మించిన రోహిత్.. వచ్చే ఏడాది వరుసగా సినిమాలు చేస్తానని అంటున్నాడు.
ఈ విషయంపై మరింతగా స్పందించిన రోహిత్... అరన్ మీడియా వర్క్స్ బేనర్ మీద వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మిస్తామని, వీలైతే బయటి వాళ్లతో కూడా సినిమాలు చేసే ఉద్దేశం తమకు ఉందని చెబుతున్నాడు. అయితే, తన ప్రొడక్షన్లో చేసే తొలి సినిమా ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పూర్తిస్థాయి వైవిధ్యమైన కథను ఎంచుకున్నానని, దాని ఫలితమే ఎంతో సంతృప్తినిచ్చిన "అప్పట్లో ఒకడుండేవాడు" సినిమా అని అన్నారు రోహిత్. ఇక కథ విషయానికొస్తే... నక్సలిజం - గ్లోబలైజేషన్ - క్రికెట్.. ఇలా అనేక అంశాల ప్రస్తావనతో కూడిన పెద్ద కథ ఇది అని, ఇలాంటి కథను రెండు గంటల్లో చెప్పడం అనే సవాలును దర్శకుడు సాగర్ చంద్ర సమర్థంగా నిర్వర్తించాడని అన్నాడు. ఈ సినిమా తన కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసిన రోహిత్... ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/