గ్లోబల్ వార్మింగ్ కి కారణం ఈ భామే

Update: 2016-03-28 04:55 GMT
సమ్మర్ వస్తోందంటేనే మంటలు మండడం ఖాయమే కానీ.. మళ్లీ ఈ వేసవిలో మరో మంట రాజేయడానికి బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ వచ్చేసింది. ఫెమినా సమ్మర్ ఎడిషన్ లో ఈ బ్యూటీ కవర్ పేజ్ ఆక్యుపై చేసేసింది. నిజానికి గతేడాది కూడా సమ్మర్ ఎడిషన్ కవర్ పేజ్ పై ఈ సుందరాంగే కనిపించిది. మరి సమ్మర్ వేడికి సమానంగా హీట్ పుట్టించగలగడం వేరే ఎవరికీ సాధ్యం కాదనే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి... మరోసారి ఆ సుందరాంగినే కవర్ పేజ్ ఎక్కించేశారు.

ట్రాన్స్ పరెంట్ వైట్ షర్ట్ - బికినీ వేర్.. చేతికి ఫ్యాషన్ గాజులు - మెడలో డిజైనర్ చెయిన్స్.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. మత్తైన కళ్లతో నర్గీస్ ఫక్రీ లుక్ అన్నిటికంటే స్పెషల్. తన కళ్లలోకి చూస్తే మత్తెక్కిపోవడం ఖాయమని నర్గీస్ స్వయంగా తేల్చేసింది. 'నా కళ్లలోకి చూస్తే మీరు ఖచ్చితంగా నిద్ర పోతారు. నిద్ర లేచాక కప్పల్లా మారిపోతారు.' అంటూ తన ఫోటోతో పాటు నర్గీస్ ఫక్రీ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది.

ఇక 'సమ్మర్ వచ్చేసింది. వేడి మొదలవక ముందే తెచ్చుకోండి' అంటూ ఫ్యాన్స్ ని నర్గీస్ ఫక్రీ టీజింగ్ కూడా చేస్తోంది. ఈ ఫోటోలు, అమ్మడి ఫోజులు చూశాక.. చాలామందికి గ్లోబల్ వార్మింగ్ ఈ రేంజ్ లో ఎందుకు పెరుగుతోందో అర్ధమైందిట.
Tags:    

Similar News