నయనతార కవర్ 'డ్రైవ్'.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

Update: 2022-12-22 06:11 GMT
నయనతార వెండితెరకు పరిచయమై చాలా ఏళ్ళే గడుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరిగా కొనసాగుతున్నారు. ఆమె కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నారు. లేడి ఒరియంటేడ్ సినిమాలతోనే నయన్ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఆమెకు యమ క్రేజ్ ఏర్పడింది.

నయనతార సినిమాలతో అభిమానులను ఎలా అలరించిందో.. అంతకంటే ఎక్కువగా ఎఫైర్స్.. గాసిప్స్ విషయాలతో క్రేజ్ సంపాదించుకుంది. నయతారపై వచ్చిన గాసిప్స్ మరే హీరోయిన్ పై రాలేదు అన్నట్లు ఆమెపై కథనాలు వచ్చాయి. వీటన్నింటికీ కూడా ఆమె హీరోలు.. డైరెక్టర్లతో ఆమె ప్రవర్తించే తీరు కారణమనే వారు లేకపోలేదు.

ఇదంతా ఎలా ఉన్నప్పటికీ నయనతారపై ఒక అపవాదు మాత్రం ఎప్పటి నుంచో ఉంది. నయనతార తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రమోషన్స్ లో మాత్రం పెద్దగా కనిపించలేదు. కెరీర్ మొదటి ఒకటి అర సినిమా ప్రమోషన్స్ కన్పించిన నయనతార ఆ తర్వాత పూర్తిగా దూరంగా ఉంది.

తెలుగు.. తమిళంలో ఆమె ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కేవలం 'శ్రీరామరాజ్యం' మూవీ ప్రమోషన్స్ మాత్రమే పాల్గొంది. ఇదేదో భక్తి సినిమా అని ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంది అనుకుంటే పొరపాటే. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాకు గుడ్ బై చెప్పేందుకు అప్పట్లో రెడీ అయింది. ఆ కారణంగానే ఆ సినిమా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొందనే టాక్ ఉంది.

దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం.. పెళ్లి.. పిల్లల తర్వాత కూడా నయనతార సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగాను కొత్త అవతారం ఎత్తింది. తన భర్త విఘ్నేశ్ తెరకెక్కించిన పలు సినిమాలకు ఆమె నిర్మాతగా.. హీరోయిన్ గానూ వ్యవహరిస్తోంది. అయితే ఆమె నిర్మాతగా ఉన్న సినిమాలకు మాత్రమే ప్రమోషన్స్ చేస్తుండటంతో నయన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నీవే డబ్బులు గానీ నిర్మాతలవి మాత్రం డబ్బులు కాదా? అంటూ పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాను నిర్మించిన సినిమాలకు ప్రమోషన్స్ చేస్తే విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించిన నయనతార ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగించుకొని మరీ కవర్ డ్రైవ్ లాంటి సమాధానాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కనెక్ట్ సినిమా ప్రమషన్స్ లో భాగంగా ఆమెను సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈక్రమంలోనే ఇన్ని రోజులు సినిమా వేడుకల్లో.. ఇంటర్వ్యూలో ఎందుకు పాల్గొనలేదు లేదు అని సుమ నయన్ ను అడగగా.. తాను ఎప్పటి నుంచి మీతో(సుమ) ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నానని చెప్పింది. కానీ మీరు బీజీగా ఉండటం వల్ల వేరే వాళ్లతో ఇంటర్వ్యూలు చేయడం ఇష్టం లేకే చేయలేదని నవ్వుతూ చెప్పింది.

అయితే దీనికి గాడ్ ఫాదర్ సక్సస్ మీట్ లోనూ ఎందుకు పాల్గొనలేదని అడిగితే తాను ఫారిన్ ఉన్నానంటూ కవరింగ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగు.. తమిళ్.. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిందని.. ఆ సమయంలో ఆమె ఇండియాలోనే ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీనిపై నయన్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News