న‌య‌న‌తార కూడా దొరే

Update: 2016-07-05 04:56 GMT
ఈమ‌ధ్యే దొర పేరుతో ఓ హార్ర‌ర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌ట్ట‌ప్ప స‌త్య‌రాజ్ - ఆయ‌న త‌న‌యుడు శిబిరాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన జాక్స‌న్ దొరై అనే త‌మిళ చిత్రం తెలుగులో దొర‌గా  డ‌బ్ అయ్యింది.  ఆ చిత్రం పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. అయితే ఇప్పుడు న‌య‌న‌తార కూడా దొర‌గానే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ధారిగా త‌మిళంలో  దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆ చిత్రానికే దొర అనే పేరును క‌న్ఫ‌ర్మ్ చేశారు.

త‌మిళంలోనే దొర అని పెట్టారంటే మ‌రి తెలుగులో ఏ పేరు పెడ‌తారో చూడాలి. న‌య‌న‌తార ఓ  స్టార్ హీరోయిన్‌ గా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కొంత‌కాలంగా హార‌ర్  క‌థ‌ల‌తో తెరకెక్కే చిన్న క‌థ‌ల్నీ ఒప్పుకొంటూ సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా చేసిన మయూరి ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మ‌రో థ్రిల్ల‌ర్ చేసింది. అదే దొర‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రి ఈ చిత్రంలో న‌య‌న్ ఎలా క‌నిపిస్తుందో, ఎలా భ‌య‌పెడుతుందో చూడాలి. తమిళంలో ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి.
Tags:    

Similar News