నయనతార కెరీర్ ఆరంభం నుండి కూడా పలు వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. మొదట శింబుతో ఈ అమ్మడు ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలో ఒక వీడియో లీక్ అవ్వడంతో అతడి నుండి దూరం అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పటికే పెళ్లి అయిన ప్రభుదేవాను ప్రేమించింది. ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు పీఠల వరకు వెళ్లింది. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. పెళ్లి కోసం మతం మార్చుకుంది.. సినిమాలను వదిలేయాలనుకుంది. కాని ప్రభుదేవాతో ఆమె చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.
ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న సమయంలో ఆయన పేరును చేతిపై నయన్ టాటూ వేయించుకుంది. ఆ టాటూ అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ టాటూ మొన్నటి వరకు కూడా ఆమె చేతికి అలాగే ఉంది. అది పర్మినెంట్ టాటూ అవ్వడం వల్ల దాన్ని తొలగించుకోవడం సాధ్యం కాలేదు. ఇష్టం లేకున్నా కూడా ఇన్నాళ్లు ప్రభుదేవా జ్ఞాపకాలను నయన్ మోస్తూ వచ్చింది. తాజాగా ప్రభుదేవా ఆ జ్ఞాపకాలను పూర్తిగా వదిలేసింది.
ఇటీవల ఆ టాటూను ఆపరేషన్ ద్వారా తొలగించేసింది. ఆ స్థానంలో పాజిటివిటీ అనే టాటూను ఆమె వేయించుకుంది. ఇన్నాళ్ల తర్వాత ఆ పేరును నయన్ ఎందుకు తీయాల్సి వచ్చింది.. అంత పెద్ద సాహసంకు ఇప్పుడు ఎందుకు ఆమె సిద్దం అయ్యిందని అనుకుంటున్నారు. త్వరలో నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది వీరి పెళ్లి అవ్వబోతుంది. కనుక ఆ టాటూను తొలగించి ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.