ఫోటో స్టోరి: టామీ గాళ్ నిగ‌నిగ‌లు

Update: 2019-01-06 01:30 GMT
సౌత్ టు నార్త్ నీతూ చంద్ర కెరీర్ గురించి తెలిసిందే. త‌మిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో న‌టించింది. విష్ణు, గోదావ‌రి, స‌త్య‌మేవ జ‌య‌తే వంటి తెలుగు చిత్రాల్లో నాయిక‌గా న‌టించింది. క‌మ్ముల `గోదావ‌రి` చిత్రంతో తెలుగు నాటా ఫేమ‌స్‌ అయ్యింది ఈ అమ్మ‌డు. అక్కినేని కాంపౌండ్ `మ‌నం` చిత్రంలోనూ అతిధి పాత్ర‌లో త‌ళుక్కుమంది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మ‌డు ఆశించినంత పెద్ద స్థాయికి ఎద‌గ‌లేక‌పోయింది. అటు త‌మిళం, హిందీ వ‌ర‌కూ ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లోనూ న‌టించింది. ఇక‌పోతే నీతూ చంద్ర కెరీర్ ఇటీవ‌ల పూర్తిగా జీరో అయిపోయింది.

ఇటు టాలీవుడ్ లో కానీ, అటు త‌మిళంలో కానీ అస్స‌లు సినిమాలే లేక‌పోవ‌డంతో ఖాళీగా ఉంటున్న ఈ భామ బాగా వెయిట్ పెరిగి క‌నిపిస్తోంది. లేటెస్ట్ ఫోటోషూట్ లో నీతూ గ‌రంగ‌రంగా క‌నిపించినా బొద్దుత‌నం మాత్రం దాచ‌లేక‌పోయింది. ఇత‌ర నాయిక‌ల్లానే ఈ అమ్మ‌డు కూడా సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం ఫోటోషూట్ల‌తో ట‌చ్ లో ఉంటున్నా, మునుప‌టి క్రేజు మాత్రం ఇప్పుడు లేనేలేదు. అందుకేనేమో తిరిగి కెరీర్ ని స్ట్రీమ్ లైన్ చేసేందుకు ఇలా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుపడుతోంది.

2019లో ప్ర‌వేశిస్తున్న వేళ కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్ని కుటుంబ స‌భ్యుల‌తో సెల‌బ్రేట్ చేసుకున్న నీతూ, మునుముందు కెరీర్ ప‌రంగా కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ట‌. అలాగే తన‌వంతుగా సామాజిక బాధ్య‌త‌గా టొబాకో ఫ్రీ ప్ర‌పంచాన్ని చూడాల‌నుకుంటున్నాన‌ని ప్ర‌చారం చేస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లోనూ న‌టించింది. ఇక తాజా ఫోటోషూట్ తో మ‌రోసారి హాట్ గా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. `పోలెట్టీ డిజైన్` అంటూ ఈ లుక్ గురించి చెప్పింది నీతూ. ఈ చ‌లికాలాన్ని వేడెక్కించేందుకు డిజైన్ చేసిన స్పెష‌ల్ డ్రెస్ ఇది. పూర్తిగా ఊలుతో త‌యారు చేసిన‌ది. ఇంకా చెప్పాలంటే ఊలు దుస్తుల్లో దూరిన టామీలా క‌నిపిస్తోంది నీతూ.






Full View
Tags:    

Similar News