అలనాటి బాలీవుడ్ రోమాంటిక్ హీరో రిషి కపూర్ మరణం దేశవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో విషాదం నింపింది. రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 30న ఆయన చనిపోయాడు. ఈ విషాదం నుంచి తేరుకొని వారి కుటుంబం ఈ సందర్భంగా సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
తాజాగా రిషికపూర్ భార్య నీతూ సింగ్ ఎమోషన్ లేఖ చర్చనీయాంశమైంది. రిషికపూర్ క్యాన్సర్ వ్యాధికి సహకరించిన వారికి నీతూ సింగ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా దేశంలోనే అపర కుబేరుడు అయిన పారిశ్రామిక దిగ్గజం అంబానీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
క్యాన్సర్ తో పోరాడుతున్న నా భర్త రిషి కపూర్ కు నైతిక మద్దతును ఇచ్చిన ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటామని.. రిషి తీవ్రంగా బాధపడుతుంటే అంబానీ కుటుంబం అందించిన సహకారం మరువలేనిదని ఆమె వారి సేవలను కొనియాడారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు అందరినీ కదిలించింది. అంబానీ ఫ్యామిలీ మాకు సపోర్ట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఊహించని విధంగా ఉండేదని నీతూ సింగ్ పోస్టు లో ఆవేదన వ్యక్తం చేసింది.
రిషికపూర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా వచ్చి పరామర్శించారని.. మానసిక స్థైర్యాన్ని అందించారని నీతూసింగ్ లేఖలో గుర్తు చేసుకున్నారు. వారు ఇచ్చిన ధైర్యం ఎనలేనదన్నారు. ముఖేష్, నీతా, అకాష్, శ్లోకా, ఇషాలకు మా కుటుంబ సభ్యులు కుమారుడు రణబీర్, కుమార్తె రిద్దిమా కపూర్, కపూర్ ఫ్యామిలీల నుంచి ధన్యవాదాలు అంటూ నీతా ఎమోషనల్ లేఖను విడుదల చేశారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.