చిత్రం : ‘నీవెవరో’
నటీనటులు: ఆది పినిశెట్టి - తాప్సి - రితికా సింగ్ - వెన్నెల కిషోర్ - సప్తగిరి - తులసి - శివాజీ రాజా తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి - ప్రసన్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
రచన: కోన వెంకట్
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
దర్శకత్వం: హరినాథ్
‘ఒక విచిత్రం’ సినిమాతో తెలుగులోనే ముందు కథానాయకుడిగా పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. కానీ ఆ చిత్రం మంచి ఫలితాన్నివ్వకపోవడంతో తమిళం వైపు అడుగులేశాడు. అక్కడ మంచి పేరు సంపాదించి తిరిగి తెలుగులోకి వచ్చాడు. ఐతే ప్రత్యేక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ.. హీరోగా మాత్రం ఇంకా విజయాన్నందుకోలేదు. ఇప్పుడతను కథానాయకుడిగా ‘నీవెవరో’ సినిమా తెరకెక్కింది. ఆసక్తికర ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఆదికి ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.
కథ:
కళ్యాణ్ (ఆది పినిశెట్టి) 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన కుర్రాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చెఫ్ గా ఎదుగుతాడు. సొంతంగా రెస్టారెంట్ పెట్టి నడిపే స్థాయికి చేరుకుంటాడు. అతను అనుకోకుండా పరిచయమైన వెన్నెల (తాప్సి)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయడానికి కూడా ముందుకొస్తాడు. కానీ ఆలోపే అతను మరోసారి ప్రమాదానికి గురవుతాడు. ఈసారి కోలుకునే క్రమంలో అతడి కళ్లకు శస్త్రచికిత్స జరిగి మళ్లీ చూపు వస్తుంది. కళ్లు తెరిచి చూశాక అతడికి వెన్నెల కనిపించదు. తన జాడ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. వెన్నెల కనిపించక పిచ్చోడైపోతున్న కళ్యాణ్.. ఆమె కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఇంతకీ వెన్నెల ఎవరు.. ఆమె నేపథ్యమేంటి.. ఆమె గురించి కళ్యాణ్ తెలుసుకున్నదేంటి అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘నీవెవరో’ ట్రైలర్ చూస్తే.. అందులోని కొన్ని షాట్లు ఫాస్ట్ ఫార్వార్డ్ లో కనిపిస్తాయి. ఇదొక మిస్టరీని ఛేదించే థ్రిల్లర్ మూవీ అనే విషయం అర్థమవుతుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతుందనుకుంటాం. కానీ సినిమాలో అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుంది. ఇందులో మిస్టరీని ఛేదించే సన్నివేశాలు చూస్తే.. సీరియళ్లు గుర్తుకొస్తే ఆశ్చర్యమేమీ లేదు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దాన్ని డీల్ చేసిన విధానం పేలవంగా తయారైంది. మిస్టరీని ఛేదించడానికి వేసుకున్న స్క్రీన్ ప్లే లాక్స్ తేలిపోయాయి. కామెడీ ఎంటర్టైనర్లకు స్క్రీన్ ప్లే రాయడంలో ఆరితేరిన కోన వెంకట్.. ఒక థ్రిల్లర్ మూవీకి ఆసక్తికర స్క్రీన్ ప్లే రాయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. తెరమీద మిస్టరీని ఛేదిస్తుంటే.. ప్రేక్షకులు ఉత్కంఠతో ఊగిపోవాల్సింది పోయి.. ఇంకెంతసేపు ఈ నాన్చుడు అని ఫీలైతే దాన్ని థ్రిల్లర్ మూవీ అని పిలుస్తాం?
‘నీవెవరో’.. తమిళంలో విజయవంతమైన ‘అదే కంగల్’ సినిమాకు రీమేక్. కాన్సెప్ట్ కొంచెం భిన్నంగానే ఉంటుంది కాబట్టి దీన్ని తెలుగులో రీమేక్ చేయడానికి టెంప్ట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తెలుగులో ‘క్షణం’.. ‘గూఢచారి’ లాంటి ఇంటిలిజెంట్ థ్రిల్లర్లు చాలానే చూశాం గత కొన్నేళ్లలో. తెలుగు ఫిలిం మేకర్స్ మన సినిమా స్థాయిని ఎంతగానో పెంచారు. ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారిపోయింది. ఒక్క సీన్ చూసి క్లైమాక్స్ వరకు అంతా ఊహించేస్తున్నారు. వాళ్లను నిరంతరం సస్పెన్సులో ఉంచుతూ.. ఉత్కంఠ రేకెత్తిస్తూ కథాకథనాల్ని నడిపించడం అంత తేలిక కాదు. ఐతే ‘నీవెవరో’ టీం ప్రేక్షకుల స్థాయిని అందుకోలేకపోయింది. ‘నీవెవరో’లో తాప్సి పాత్ర తాలూకు రహస్యాన్ని సినిమాలో చివరి 20 నిమిషాల వరకు భలేగా దాచి పెట్టామని రచయిత.. దర్శకుడు అనుకుని ఉండొచ్చేమో కానీ.. ఆమె పాత్రపై ఒక అంచనాకు రావడం అంత కష్టమేమీ కాదు. అందులోనూ మన ఆడియన్స్ ఈ మధ్యే ‘ఆర్ఎక్స్ 100’ లాంటి సినిమా చూసి హీరోయిన్ పాత్ర విషయంలో ఎలాంటి షాకులకైనా సిద్ధపడిపోయారు కూడా. ఇలాంటి టైంలో సినిమాలో తాప్సి పాత్ర అంత ఆశ్చర్యానికేమీ గురి చేయదు.
అంధుడైన హీరో చెఫ్ గా మంచి పేరు సంపాదించడం.. స్వశక్తితో రెస్టారెంట్ యజమాని కావడం.. దీని తాలూకు సెటప్ ఆరంభంలో బాగానే అనిపిస్తుంది. హీరో అంధుడు కాబట్టి మున్ముందు వ్యవహారం ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంటాం. కానీ కాసేపటికే కథ సాదాసీదాగా తయారవుతుంది. ఆది-తాప్సి రొమాంటిక్ ట్రాక్ తేలిపోయింది. ఇక హీరోకు కంటి చూపు రాగానే ‘నీవెవరో’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం మొదలవుతుంది. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకుండా.. సాగతీతగా సాగే సన్నివేశాలు కథను పక్కదోవ పట్టిస్తాయి. హీరోయిన్ కోసం హీరో అన్వేషించే క్రమంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాదాపు గంట పాటు ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ ఎక్కడా ఆసక్తి ఉండదు. చాలా సాదాసీదాగా అనిపించే.. ‘చిక్కు’ లేని ముడులతో సినిమా చాలా బోరింగ్ గా తయారవుతుంది. ఇక ప్రేక్షకుల సహనం చచ్చిపోతున్న దశలో మిస్టరీ ఏంటో రివీల్ అవుతుంది. అక్కడి నుంచి ఓ 20 నిమిషాలు మాత్రం ‘నీవెవరో’ ఎంగేజ్ చేస్తుంది. తాప్సి పాత్ర.. దాని చుట్టూ నడిచే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. ముగింపు కూడా ఓకే అనిపిస్తుంది. కానీ అంతకుముందు నడిచిన వ్యవహారం మాత్రం ‘నీవెవరో’ను బోరింగ్ గా తయారు చేసింది. థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన ప్రధాన బలం ఉత్కంఠ. అదే ‘నీవెవరో’లో మిస్సయింది.
నటీనటులు:
ఆది పినిశెట్టి అంధుడిగా ఉన్నంత వరకు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తనకు చూపు వచ్చినపుడు అతడి హావభావాలు మెప్పిస్తాయి. ఐతే ఒక దశ దాటాక అతడి పాత్ర తేలిపోయింది. అతను నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయింది. తాప్సి పాత్ర.. ఆమె నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆ పాత్రలోని మరో కోణం చూపించే దగ్గర్నుంచి తాప్సి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రితికా సింగ్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. వెన్నెల కిషోర్ కు మంచి లెంగ్త్ ఉన్న రోలే దొరికింది కానీ.. కామెడీ అతడి స్థాయికి తగ్గట్లుగా లేదు. సప్తగిరి కామెడీ కూడా పండలేదు. తులసి.. శివాజీ రాజా పాత్రలు.. నటన మామూలే.
సాంకేతికవర్గం:
అచ్చు రాజమణి-ప్రసన్ కలిసి అందించిన సంగీతం పర్వాలేదు. సిద్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాట ఒకటి ప్రత్యేకంగా నిలుస్తుంది. తాప్సి మీద వచ్చే థీమ్ సాంగ్ కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగానే ఉంది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. రచయిత కోన వెంకట్ మెరుపులేమీ సినిమాలో కనిపించలేదు. ‘‘బట్టలు విప్పేసి ఉన్నా. వచ్చేయ్’’ అని సీఐ భార్య అంటే దానికి బదులుగా వెన్నెల కిషోర్ ‘‘బట్టలు విప్పేసి నాకు ఫోన్ చేస్తారేంటి. సీఐ గారికి ఫోన్ చేయండి’’ అంటాడు. ‘‘నేను బట్టలు విప్పింది లాండ్రీకి వేయడానికి’’ అని ఆమె అంటుంది. ఇలాంటి కామెడీని ఈ రోజుల్లో కూడా జనాలు ఎంజాయ్ చేస్తారని కోన అనుకుంటున్నారంటే ఏం చెప్పాలో అర్థం కాదు. దర్శకుడు హరినాథ్ పనితనం గురించి చెప్పడానికేమీ లేదు. మంచి కాన్సెప్ట్ ను అతను సరిగా డీల్ చేయలేకపోయాడు.
చివరగా: నీవెవరో.. పేరుకే థ్రిల్లర్!
రేటింగ్-2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre