స్కైజోన్‌ లో నేల టికెట్ బ్యాచ్‌

Update: 2018-04-06 10:06 GMT
మాస్ రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం క‌ల్యాణ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘నేల టికెట్‌’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘సొగ్గాడే చిన్ని నాయ‌నా’- ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్లు తీసిన క‌ల్యాణ కృష్ణ స్టైల్ లోనే ఉంటూ... మాస్ కి న‌చ్చే అంశాల‌ను కూడా జోడించి- నేల టికెట్ సినిమాను రూపొందిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మే 24న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ కొత్త రికార్డు సృష్టించ‌నుంది.

హైద‌రాబాద్‌లోని గండిపేట స‌మీపంలో మ‌న దేశంలోనే మొట్ట‌మొద‌టి స్కై జోన్ ట్రంపోలిన్ పార్క్ ఏర్పాటు చేశారు. గ‌త ఏడాది  గ్రాండ్ ఓపెనింగ్ జ‌రుపుకున్న ఈ పార్కులో ఆట‌ల‌న్నీ భ‌లే వింత‌గా... గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. ముఖ్యంగా గెంతితే... అంతెత్తుకు ఎగిరేసే ప్ర‌త్యేక‌మైన ట్రాపోలిన్ క‌వ‌ర్లు ఇక్క‌డ క‌నిపిస్తాయి. వీటిపైన ఎగురుతూ... ఆడుతూ వీకెండ్స్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు న‌గ‌ర‌వాసులు.  ఇంత వ‌ర‌కూ ఈ పార్కులో ఏ సినిమా షూటింగ్ జ‌రుపుకోలేదు. ఇక్క‌డ షూటింగ్ జ‌రుపుకోబోతున్న మొట్ట‌మొద‌టి సినిమాగా ‘నేల టికెట్‌’ రికార్డు న‌మోదు చేయ‌నుంది. ఈ పార్కులో ఓ చిన్న సీనో... ఫైటో కాదు... ఏకంగా ఓ పాట‌ను చిత్రీక‌రించాల‌ని భావిస్తోంది చిత్ర బృందం. డ్యాన్స్ మాస్ట‌ర్ రాజు సుంద‌రం ఈ పాట‌కు స్టెప్పులు స‌మ‌కూర్చ‌నున్నారు.

ట్రంపోలిన్ పార్కులో పాట తీయ‌డ‌మంటే చాలా రిస్కీ టాస్కే. ఎగురుతూ... గెంతుతూ స్టెప్పులు చేయాల్సి ఉంటుంది. మ‌రి ఇలాంటి చోట రాజు సుంద‌రం ఎలాంటి స్టెప్పులు కంపోజ్ చేస్తాడ‌నేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘నేల టికెట్‌’ సినిమాతో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News