హీరోయిన్ హన్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన వ్యవహారం రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయింది. లీక్ అయ్యాయని కొందరు.. ఫోన్ హ్యాక్ అయి ఉంటుందని కొందరు.. పబ్లిసిటీ కోసం హన్సికే లీక్ చేసిందని మరొకొందరు ఎవరికి అనిపించింది వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ లీక్ వ్యవహారం పై హన్సిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.
"ఫోన్.. ట్విట్టర్ హ్యాక్ అయ్యాయి. దయచేసి మీరు ఎటువంటి మెసేజులకు స్పందించవద్దు. నా బ్యాక్ హ్యాండ్ టీమ్ ప్రస్తుతం వాటిని కంట్రోల్ లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు." అంటూ ఒక ట్వీట్ చేసింది. దీంతో నెటిజనులు వెంటనే ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొందరు "అది బ్యాక్ హ్యాండ్ టీమ్ కాదు.. బ్యాక్ ఎండ్ టీమ్" అంటూ ఇంగ్లీష్ ను సరిచేస్తూ అక్షింతలు వేస్తే.. మరికొందరు "నీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయితే ఈ మెసేజ్ ఎలా పెట్టావు.. మాకు చెవిలో పూలు పెడుతున్నావా?" అంటూ ప్రశ్నించారు. కొందరు నెటిజనులు మాత్రం అసలు హన్సిక సినిమాల్లో చేసిన హాట్ సీన్లతో పోలిస్తే ఇవేం పెద్ద హాటు ఫోటోలు కాదని.. దానికే ఈ రచ్చ ఏంటని చిరాకుపడుతున్నారు.
ఈ ట్రోలింగ్ తో సంబంధం లేకుండా హన్సిక సన్నిహితులు మాత్రం ఈ హ్యాకింగ్ పై పోలీసులకు కంప్లయింట్ చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఈ లీక్ ఫోటోల ఎపిసోడ్ తో హన్సిక ఒక్కసారిగా తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక హ్యాక్ సంగతి.. లీక్ సంగతంటారా.. దేశముదురు పాప ఫిర్యాదు చెయ్యాలి.. పోలీసులు విచారణ చెయ్యాలి. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి!